టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ.. నిజమైన నాయకుడు అని ప్రశంసించాడు బౌలర్ మోహిత్ శర్మ. మహీ సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్, భారత్ తరఫున ఆడిన ఇతడు.. దిల్లీ ఫ్రాంఛైజీ ఆదివారం నిర్వహించిన ఇన్‌స్టా లైవ్ సెషన్లో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
'గెలిచినప్పుడు ధోనీ ఎక్కడున్నా.. ఓడినప్పుడు ముందుంటాడు' - dhoni latest news
భారత స్టార్ క్రికెటర్ ధోనీ.. నిజమైన నాయకుడు అని చెప్పాడు బౌలర్ మోహిత్ శర్మ. దీనితో పాటే అతడి గురించి పలు విషయాలు వెల్లడించాడు.
"నేను ఆడిన వారిలో ధోనీ ప్రత్యేకం. ఎందుకంటే గర్వం లేకుండా కృతజ్ఞత మాత్రమే చూపిస్తాడు. ఆటలో కెప్టెన్‌కు, నాయకుడికి తేడా అదే. అందుకే మహీ నిజమైన నాయకుడు. జట్టు గెలిచినప్పుడు ఎక్కడున్నా, ఓడినప్పుడు మాత్రం తానే బాధ్యత తీసుకుంటాడు. అదే నాయకుడికి ఉండాల్సిన లక్షణం" -మోహిత్ శర్మ, భారత బౌలర్
ప్రస్తుతం దిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు మోహిత్. కరోనా లాక్డౌన్ వల్ల ఈ లీగ్ నిరవధిక వాయిదా పడింది. దీంతో క్రికెటర్లు అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. సోషల్ మీడియా వేదికగా అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు.