తెలంగాణ

telangana

ETV Bharat / sports

హగ్ కావాలా.. నాయనా - నాగపూర్​లో జరుగుతున్న రెండో వన్డేలో ధోనీ ఓ అభిమానిని ఆటపట్టించాడు

నాగపూర్​లో జరుగుతున్న రెండో వన్డేలో ధోనీ ఓ అభిమానిని ఆటపట్టించాడు. హగ్​ కోసం వెంటాడిన ఓ వ్యక్తిని కొంతసేపు పరిగెత్తించాడు.

హగ్ కావాలా.. నాయనా

By

Published : Mar 5, 2019, 8:02 PM IST

వికెట్ల మధ్య అద్భుతంగా పరిగెత్తే మహీ...మిగతా ఆటగాళ్ల లాగే ఓ అభిమానిని ఆటపట్టించాడు. మంగళవారం ఆసిస్​తో జరిగిన మ్యాచ్​లో ఓ వ్యక్తి సెక్యూరిటీని దాటి గ్రౌండ్​లోకి వచ్చేశాడు. అనంతరం తన అభిమాన ఆటగాడు ధోనిని హగ్​ చేసుకునే ప్రయత్నం చేయగా...మిస్టర్​ కూల్​ ఆ వ్యక్తి నుంచి తప్పించుకుంటూ కొంత దూరం పరిగెత్తాడు. ఆ అభిమాని ప్రయత్నించి ధోనిని ముట్టుకోగానే హగ్​ ఇచ్చి పంపేశాడు. 250 పరుగుల లక్ష్యం ఇచ్చి ఫీల్డింగ్​కు సిద్ధమైన టీమిండియా​...గ్రౌండ్​లోకి అడుగుపెడుతున్న సందర్భంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.

ABOUT THE AUTHOR

...view details