రిటైర్మెంట్ తీసుకున్న ప్రముఖ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీకి.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు విషెస్ చెబుతున్నారు. క్రికెట్‌కు అతడు చేసిన సేవలు మర్చిపోలేనివి అంటూ కీర్తిస్తున్నారు. ఇదే విషయమై స్పందించిన అంతర్జాతీయ క్రికెట్ మండలి.. మొత్తం జనరేషన్‌కే ధోనీ స్పూర్తి కలిగించాడని ప్రశంసించింది. మైదానంలో అతడిని కచ్చితంగా మిస్ అవుతామని చెప్పింది.
ధోనీ రిటైర్మెంట్పై ఐసీసీ ట్వీట్ "క్రికెట్లోని ఆల్‌టైమ్ దిగ్గజాల్లో ధోనీ ఒకరు. 2011 ప్రపంచకప్ ఫైనల్లో అతడు కొట్టిన విన్నింగ్ సిక్సర్‌ను ప్రపంచవ్యాప్త క్రికెట్ అభిమానుల జ్ఞాపకార్ధంగా ఉంచాలి. అతడు ప్రస్తుత జనరేషన్ మొత్తానికి స్పూర్తి కలిగించాడు. కచ్చితంగా మహీని మిస్ అవుతాం. తన క్రికెట్ కెరీర్‌ను అద్భుతంగా ముగించిన ధోనీకి ఐసీసీ తరఫున శుభాకాంక్షలు చెబుతున్నా. భవిష్యత్తుకు ఆల్ ది బెస్ట్."
-మను సావ్నే, ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్
39 ఏళ్ల ధోనీ.. దాదాపు 16 ఏళ్ల పాటు(2004-2020) భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. మూడు ఐసీసీ ట్రోఫీలు(2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ)లు గెల్చుకున్న ఏకైక కెప్టెన్ ధోనీనే. గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్ సెమీస్‌లో చివరగా ధోనీ కనిపించాడు. ఆ తర్వాత ఇప్పుడు రిటైర్మెంట్ ప్రకటించాడు.
ధోనీ కెరీర్ గణాంకాలు
- 98 టెస్టుల్లో 4,876 పరుగులు.. 256 క్యాచ్‌లు, 38 స్టంపింగ్‌లు
- 350 వన్డేల్లో 10,773 పరుగులు.. 321 క్యాచ్‌లు, 123 స్టంపింగ్‌లు
- 98 టీ20ల్లో 1617 పరుగులు.. 57 క్యాచ్‌లు, 34 స్టంపింగ్‌లు
- వన్డేల్లో 10 శతకాలు, టెస్టుల్లో 6 సెంచరీలు
- 2006-2010 మధ్య కాలంలో 656 రోజులపాటు ఐసీసీ పురుషుల వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్
- 2008, 09లలో ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు
- 2006, 08, 09, 10, 11, 12, 13లలో ఐసీసీ వన్డే జట్టులో సభ్యుడు
- 2009, 10, 12, 13లలో ఐసీసీ టెస్టు జట్టులో సభ్యుడు
- 2011 ఐసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డు