'ఐసీసీ టీమ్ ఆఫ్ ది డెకెడ్' అవార్డుల్లో భారత ఆటగాళ్లదే హవా. వన్డే, టీ20 ఫార్మాట్లకు ఎంఎస్ ధోనీ సారథిగా, టెస్టు జట్టుకు కోహ్లీ కెప్టెన్‌గా ఎంపికయ్యారు. ఈ దశాబ్దపు అత్యుత్తమ టీ20, వన్డే, టెస్టు క్రికెట్ జట్లను ఆదివారం ఐసీసీ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. టీ20 జట్టులో ధోనీ, కోహ్లీతో పాటు ఓపెనర్ రోహిత్ శర్మ, పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఉన్నారు. అలాగే వన్డే ఫార్మాట్‌కు వెల్లడించిన జట్టులో ధోనీ, రోహిత్, కోహ్లీ చోటు సంపాదించారు. దశాబ్దపు టెస్టు జట్టులో భారత్ నుంచి కోహ్లీ, స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఉన్నారు.
ఐసీసీ ప్రకటించిన మహిళల జట్టులో భారత్ నుంచి నలుగురు ఆటగాళ్లు ఎంపికయ్యారు. టీ20 ఫార్మాట్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్, పూనమ్ యాదవ్; వన్డే జట్టులో మిథాలీ రాజ్, జులన్ గోస్వామి చోటు సంపాదించారు. రెండు జట్లకు కెప్టెన్ ఆస్ట్రేలియా క్రికెటర్ మెగ్ లానింగ్.
దశాబ్దపు ఉత్తమ టీ20 జట్టు
రోహిత్ శర్మ, క్రిస్ గేల్, ఆరోన్ ఫించ్, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, గ్లెన్ మాక్స్‌వెల్, ఎంఎస్ ధోనీ (కెప్టెన్), పొలార్డ్, రషీద్ ఖాన్, జస్ప్రీత్ బుమ్రా, లసిత్ మలింగ
దశాబ్దపు ఉత్తమ మహిళా టీ20 జట్టు
అలిసా హేలి, సోఫిల్ డివైన్, సుజీ బేట్స్, మెగ్ లానింగ్ (కెప్టెన్), హర్మన్‌ప్రీత్ కౌర్, స్టెఫానీ టేలర్, డియాండ్ర డాటిన్, ఎలిసా పెర్రీ, అన్య స్రుబోస్లే, మెగాన్ స్కౌట్, పూనమ్ యాదవ్