తెలంగాణ

telangana

ETV Bharat / sports

కరోనా పరీక్షల తర్వాతే సీఎస్కే ప్రయాణం షురూ! - ఐపీఎల్​ తాజా వార్తలు

ఐపీఎల్​ ప్రణాళిక విషయంలో స్పష్టత కోసం చెన్నై సూపర్​కింగ్స్ యాజమాన్యం.. లీగ్​ పాలక మండలితో సమావేశమైంది. మరో వారం రోజుల్లో అన్ని ఫ్రాంచైజీలు, పాలక మండలి మధ్య మరోసారి చర్చలు జరగనున్నట్లు అధికారులు తెలిపారు.

Dhoni and boys to get COVID-19 test
సీఎస్కే

By

Published : Aug 3, 2020, 6:50 PM IST

Updated : Aug 3, 2020, 7:37 PM IST

యూఏఈ వేదికగా సెప్టెంబరు 19న ఐపీఎల్​ ప్రారంభం కానున్నట్లు బీసీసీఐ ప్రకటించిన నేపథ్యంలో.. సంబంధిత ఫ్రాంచైజీలు సన్నాహాలు ప్రారంభించాయి. ఈ క్రమంలోనే చెన్నై సూపర్​కింగ్స్​ జట్టు అన్ని టీమ్​ల కంటే ముందుగానే యూఏఈ చేరుకోవాలని చూస్తోంది. తాజాగా లీగ్​ విషయంలో మరింత స్పష్టత కోసం చెన్నై యాజమాన్యం.. ఐపీఎల్​ పాలక మండలిని సంప్రదించింది.

మరో రెండు రోజుల్లో ఐపీఎల్​ జట్లకు స్టాండర్డ్​ ఆపరేటింగ్​ ప్రోసీజర్స్​(ఎస్​ఓపీ)ని అందజేస్తామని పాలక మండలి హామీ ఇచ్చినట్లు సీఎస్కే ఫ్రాంచైజీ అధికారులు తెలిపారు. అంతేకాకుండా ఈ వారంలో ఐపీఎల్​ పాలక మండలి, అన్ని ఫ్రాంచైజీలు సమావేశం కానున్నట్లు తెలిపారు.

ఐపీఎల్​లో ధోనీ

ఐపీఎల్​ పర్యటనలో భాగంగా యూఏఈలో అందరి కంటే ముందే అడుగుపెట్టాలని సీఎస్కే భావిస్తోంది. అయితే ఆగస్టు 20 వరకు ఎటువంటి అనుమతులు ఇవ్వబోమని ఐపీఎల్​ పాలక మండలి స్పష్టం చేసింది. త్వరలో జరగనున్న సమావేశం అనంతరం అన్నింటిపై ఓ స్పష్టత వస్తుందని ఫ్రాంచైజీ అధికారులు తెలిపారు.

మరోవైపు ధోనీ, అతని జట్టు సభ్యులు చెన్నైకి చేరుకునే ముందు కరోనా పరీక్షలు చేయించుకుంటారని వివరించారు. నెగిటివ్​ అని తేలిన ఆటగాళ్లు, సహాయక సిబ్బందిని.. సమావేశమైన 48 గంటల్లోపు యూఏఈకి పంపించేందుకు ప్రణాళిక రచిస్తున్నారు. వీసా ప్రక్రియపై స్పందిస్తూ.. ప్రస్తుతం భారత ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన తర్వాత ఈ విషయంపై ఆలోచిస్తామని ఫ్రాంచైజీ అధికారులు స్పష్టం చేశారు.

Last Updated : Aug 3, 2020, 7:37 PM IST

ABOUT THE AUTHOR

...view details