టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీపై ప్రశంసలు కురిపించాడు యువ వికెట్‌కీపర్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్. మహీ తనకు మార్గదర్శకుడని, క్లిష్ట పరిస్థితుల్లో ఎప్పుడూ సహాయ పడతాడని చెప్పాడు. ఇన్‌స్టాలో దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన లైవ్ చాట్ సెషన్లో ఈ విషయాల్ని పంచుకున్నాడు.
"మైదానంలో అయినా, బయట అయినా ధోనీనే నా మార్గదర్శకుడు. సమస్యలు ఎదురైనప్పుడు అతడిని సంప్రదిస్తే... సాయం చేస్తాడు కానీ పూర్తి పరిష్కారం చెప్పరు. దీంతో అతడిపై పూర్తిగా ఆధారపడకుండానే వాటిని పరిష్కరించుకునేవాడిని. నాకిష్టమైన బ్యాటింగ్ పార్ట్నర్స్లో మహీ భాయ్ ఒకరు. అయితే అతడితో కలిసి బ్యాటింగ్ చేసే అవకాశం తక్కువసార్లు వచ్చింది"