తెలంగాణ

telangana

ETV Bharat / sports

సిరీస్​ కోసం భారత్-పరువు కోసం విండీస్​ - wivsind

భారత్​-వెస్టిండీస్ మధ్య పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా నేడు చివరి వన్డే జరగనుంది. రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రత్యక్షప్రసారం కానుంది. ఈ మ్యాచ్​లో గెలిచి వన్డే సిరీస్​ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది కోహ్లీ సేన.

భారత్

By

Published : Aug 14, 2019, 5:52 AM IST

Updated : Sep 26, 2019, 10:46 PM IST

విండీస్​పై టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.. వన్డే సిరీస్‌పై దృష్టి సారించింది. వెస్టిండీస్‌తో జరుగుతోన్న మూడు వన్డేల సిరిస్‌లో ఇప్పటికే కోహ్లీసేన 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ సిరీస్‌లో చివరి వన్డే నేడు పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరగనుంది.

ధావన్ ఫామ్​పై ఆందోళన

ప్రపంచకప్​లో గాయం కారణంగా వైదొలిగిన టీమిండియా ఓపెనర్ శిఖర్‌ ధావన్‌ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. మూడు టీ20ల సిరీస్‌లో 1, 23, 3 పరుగులతో నిరాశపరిచిన ఈ ఓపెనింగ్​ బ్యాట్స్​మెన్​​ రెండో వన్డేలో కేవలం రెండు పరుగులకే పరిమితమయ్యాడు. మొదటి వన్డే వర్షం కారణంగా రద్దయింది. ఈ నేపథ్యంలో చివరి వన్డేలో సత్తా చాటాలని భావిస్తున్నాడు శిఖర్​.

భారత్-వెస్టిండీస్

టీమిండియా సారథి కోహ్లీ రెండో వన్డేలో సెంచరీతో చెలరేగాడు. 11 ఇన్నింగ్స్‌ల తర్వాత శతకం బాది జోరుమీదున్నాడు. రోహిత్​తో పాటు యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ మంచి ఫామ్​లో ఉన్నాడు. టీ20 సిరీస్​లో విఫలమైన పంత్​ రెండో వన్డేలోనూ నిరాశపరిచాడు. ఈ మ్యాచ్​లో సత్తాచాటడం పంత్​కు చాలా అవసరం.

బౌలింగ్​లో భువనేశ్వర్, షమీ మంచి ప్రదర్శన కనబరుస్తున్నారు. రెండో వన్డేలో భువీ (4/31) రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. మహ్మద్‌ షమీ (2/39) ఫర్వాలేదనిపించాడు. కుల్దీప్‌ యాదవ్‌ (2/59) వికెట్లు తీసినప్పటికీ భారీగా పరుగులు సమర్పించుకోవడం జట్టును ఆందోళనకు గురిచేస్తోంది. ఈ మ్యాచ్​లో యువ బౌలర్​ సైనీకి చోటు లభించే అవకాశం ఉంది.

ఇప్పటికే టీ20 సిరీస్​ కోల్పోయిన వెస్టిండీస్​ జట్టు ఈ మ్యాచ్​లో గెలిచి వన్డే సిరీస్​ను కాపాడుకోవాలని భావిస్తోంది. ఆతిథ్య జట్టు బ్యాటింగ్, బౌలింగ్​లో మరింతగా మెరుగవ్వాల్సిన అవసరం ఉంది. షై హోప్​, హెట్​మయర్, నికోలస్ పూరన్​లు ఆశించినంతగా రాణించలేకపోతున్నారు. రెండో వన్డేలో ఎవిన్ లూయిస్ అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. పూరన్​ 42 పరుగులతో ఫర్వాలేదనిపించాడు.

భారత్-వెస్టిండీస్

బౌలింగ్​లోనూ విండీస్​ అంతగా ఆకట్టుకోలేకపోతోంది. కాట్రెల్, రోచ్, హోల్డర్, బ్రాత్​వైట్, థామస్ సత్తాచాటాలని జట్టు భావిస్తోంది.​

భారత్‌ జట్టు

విరాట్‌ కోహ్లీ (కెప్టెన్), రోహిత్‌ శర్మ, శిఖర్ ధావన్‌, కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, మనీశ్‌ పాండే, రిషభ్‌ పంత్‌, రవీంద్ర జడేజా, కుల్దీప్​ యాదవ్‌, యుజువేంద్ర చాహల్‌, కేదార్‌ జాదవ్‌, మహ్మద్‌ షమీ, భువనేశ్వర్‌ కుమార్‌, ఖలీల్‌ అహ్మద్‌, నవదీప్‌ సైనీ

వెస్టిండీస్‌ జట్టు

జేసన్ హోల్డర్‌ (కెప్టెన్), క్రిస్‌ గేల్‌, జాన్‌ క్యాంప్‌బెల్‌, ఎవిన్‌ లూయిస్‌, షైహోప్‌, హెట్‌మైయిర్‌, నికోలస్‌ పూరన్‌, రోస్టన్‌ ఛేజ్‌, ఫాబియన్‌ అలెన్‌, కార్లోస్‌ బ్రాత్‌వైట్‌, కీమో పాల్‌, షెల్డన్‌ కాట్రెల్‌, ఒషానే థామస్‌, కీమర్‌ రోచ్.

ఇవీ చూడండి.. ద్రవిడ్​కు ఊరట- 'కేసు' క్లియర్ చేసిన సీఓఏ

Last Updated : Sep 26, 2019, 10:46 PM IST

ABOUT THE AUTHOR

...view details