తెలంగాణ

telangana

ETV Bharat / sports

ధావన్ చేసిన పనితో.. అతడికి శిక్ష! - bird flu news

భారత క్రికెటర్ శిఖర్​ ధావన్ సామాజిక మాధ్యమాల్లో పెట్టిన ఓ ఫొటో.. ఓ పడవ నడిపే వ్యక్తిపై చర్యలు తీసుకునేలా చేసింది. అదేలా అనుకుంటున్నారా! అయితే చదవండి మరి.

Dhawan feeds birds amid bird flu, Varanasi DM says action to be taken against boatman
ధావన్​ పడవ ప్రయాణంపై జిల్లా మెజిస్ట్రేట్​ చర్యలు​

By

Published : Jan 25, 2021, 5:47 AM IST

భారత క్రికెటర్​ శిఖర్ ధావన్​ చేసిన పనికి ఓ పడవ నడిపే వ్యక్తిపై చర్యలు తీసుకోనున్నారు వారణాసి జిల్లా కలెక్టర్ కౌశల్​ రాజ్ శర్మ. అయితే ధావన్​ చేసిందల్లా కొన్ని పక్షులకు ఆహారం అందించడమే.

ధావన్​ ఇటీవల వారణాసి పర్యటనకు వెళ్లి.. కొన్ని ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. అందులో పక్షులకు ఆహారం తినిపిస్తూ కనిపించిన గబ్బర్​.. ఆ పని ఎంతో సంతోషాన్నిచ్చిందని క్యాప్షన్​ పెట్టాడు. అయితే ఇప్పుడు అదే ఫొటో వారణాసిలో అతడు పయనించిన పడవ నడిపే వ్యక్తిపై చర్యలు తీసుకోవడానికి కారణమైంది.

కొద్ది రోజులుగా పలు రాష్ట్రాల్లో బర్డ్​ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో పక్షులకు ఎలాంటి ఆహారం అందించరాదని వారణాసిలో ఆదేశాలు జారీచేశారు. ఈ క్రమంలో ధావన్​ చర్య పడవ నడిపే వ్యక్తిపై శిక్షగా మారింది.

"పడవలు నడిపేవారికి మేము స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. పర్యాటకులను పక్షులకు ఆహారం అందించకుండా చూడమని చెప్పాం. కానీ ఆ ఉత్తర్వులను కొందరు పాటించడంలేదని మా దృష్టికి వచ్చింది. ఇప్పటికే పలువురిని గుర్తించాం. వారిపై చర్యలు తీసుకుంటాం. వారి లైసెన్స్​ను ఎందుకు రద్దు చేయకూడదో ప్రశ్నిస్తాం. సాధారణంగా పర్యాటకులను ఇలాంటి విషయాలపై అవగాహన ఉండదు కాబట్టి వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు," అని కౌశల్​ రాజ్​ తెలిపారు.

జనవరి 21నాటికి 6 రాష్ట్రాల్లో పౌల్ట్రీ, కాకులు, వలస పక్షులకు 10 రాష్ట్రాల్లో బర్డ్​ఫ్లూ సోకిందని గురువారం కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. పరిస్థితిని అంచనా వేయడానికి కేంద్ర బృందం ఇప్పటికే ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details