మైదానంలో గంభీరంగా కనిపిస్తూ.. బౌలర్లు చుక్కలు చూపించే శిఖర్ ధావన్‌పై దాడి జరిగింది. అవును.. కాకపోతే గబ్బర్ను కొట్టింది అతడి కుమారుడు జోరావర్. ప్రస్తుతం జట్టుకు దూరంగా ఉన్న ధావన్.. త్వరలో జరిగే శ్రీలంక, ఆస్ట్రేలియా సిరీస్‌ల్లో ఆడనున్నాడు. ఈ సందర్భంగా తండ్రి బాగా ఆడాలని కొట్టి మరి చెబుతున్నాడు చిన్న గబ్బర్.
ధావన్ తలపైకెక్కి 'నువ్వు బాగా.. ఆడాల్సిన అవసరముంది' అంటూ కొట్టి మరి చెప్పాడు జోరావర్. అనంతరం శిఖర్ బాధ నటించగా.. 'ఐలవ్యూ డాడీ' అంటూ గబ్బర్ను కూల్ చేశాడు. ఈ వీడియోను ఇన్ స్టాలో షేర్ చేశాడు ధావన్.
"నేను బాగా ఆడేలా నా కోచ్ నాకు ప్రేరణగా నిలుస్తాడు. అయితే గబ్బర్ను కొట్టగలిగేది చిన్న గబ్బర్ ఒక్కడే. జోరావర్, నా భార్య వస్తున్నారు. వారితో మంచి సమయం గడిపేందుకు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నా" -శిఖర్ ధావన్ ఇన్ స్టా పోస్టు
శిఖర్ ధావన్ కొన్ని నెలల విరామం తర్వాత మళ్లీ జట్టులోకి వచ్చాడు. శ్రీలంకతో టీ20, ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లకు ఎంపికయ్యాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో అతడి మోకాలికి గాయమైంది. శస్త్రచికిత్స చేయించుకున్నాడు. దాదాపుగా 20 కుట్లు వేయడం వల్ల పది రోజులు నడవలేకపోయాడు. ఆ తర్వాత శ్రమించి ఫిట్‌నెస్ సాధించాడు.
ఇదీ చదవండి: అత్యంత చెత్తగా ర్యాంకింగ్స్ ఇచ్చారు: వాన్