దేశంలో రోజురోజుకు విజృంభిస్తున్న కరోనా ఈసారి ఐపీఎల్‌పై గట్టిగానే ప్రభావం చూపుతోంది. ఇప్పటికే దిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు అక్షర్ పటేల్‌తో సహా లీగ్‌తో సంబంధమున్న మరో 20 మంది వైరస్ బారిన పడ్డారు. అయితే, తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆర్సీబీ శిబిరంలో కలవరపాటు మొదలైంది. ప్రస్తుతం అతడిని ప్రత్యేకంగా ఐసోలేషన్‌లో ఉంచినట్లు తెలుస్తోంది.
ఐపీఎల్: ఆర్సీబీ ఓపెనర్ పడిక్కల్‌కు కరోనా - రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు
ఐపీఎల్‌లో కరోనా కలవరం మొదలైంది. ఇప్పటికే లీగ్‌తో సంబంధమున్న 20 మందితో పాటు దిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు అక్షర్ పటేల్‌కు కొవిడ్ సోకింది. తాజాగా బెంగుళూరు ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్ కూడా మహమ్మారి బారిన పడ్డాడు. దీంతో ఈసారి టోర్నీ నిర్వహణపై సందేహాలు నెలకొన్నాయి.
గతేడాదే ఐపీఎల్‌లో బెంగుళూరు తరఫున ఆడిన దేవ్‌దత్.. అరంగేట్ర సీజన్‌లోనే అదరగొట్టాడు. 15 మ్యాచ్‌ల్లో 31.53 సగటుతో 473 పరుగులు సాధించాడు. ఈ నేపథ్యంలోనే ఇటీవల దేశవాళీ క్రికెట్ టోర్నీ సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో ఆరు మ్యాచ్‌ల్లో 43.60 సగటుతో 218 పరుగులు చేసిన అతడు.. విజయ్ హజారే ట్రోఫీలో మరింత రెచ్చిపోయాడు. మొత్తం 737 పరుగులు చేసి టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. కాగా, ఇప్పుడు కరోనా బారినపడ్డాడు. దీంతో శుక్రవారం ముంబయి ఇండియన్స్‌తో ఆర్సీబీ తలపడే తొలి మ్యాచ్‌లో పడిక్కల్ ఆడడం కుదరకపోవచ్చు.
ఇదీ చదవండి:ఐపీఎల్: దిల్లీకి ఎదురుదెబ్బ- అక్షర్ పటేల్‌కు కరోనా!