తెలంగాణ

telangana

ETV Bharat / sports

డ్రెస్సింగ్​ రూమ్​లోకి వచ్చిన జాతీయ క్రికెట్ సెలక్టర్ - బీసీసీఐ జాతీయ జట్టు సెలెక్టర్​

రంజీ మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో జాతీయ క్రికెట్‌ జట్టు సెలక్టర్​ దేవాంగ్‌ గాంధీ క్రికెటర్ల డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి వెళ్లడం సరికొత్త వివాదానికి తెరలేపింది. అనంతరం అతడిని అక్కడ నుంచి పంపించారు.

Devang Gandhi on Bengal dressing room incident at Ranji Trophy game
బీసీసీఐ సెక్షన్​ కమిటీ సభ్యుడు దేవాంగ్​ గాంధీ

By

Published : Dec 26, 2019, 9:16 PM IST

ఆంధ్ర - బెంగాల్ జట్ల మధ్య గురువారం రెండో రోజు ఆట జరుగుతుండగా దేవాంగ్‌ గాంధీ బంగాల్‌ క్రికెటర్ల డ్రెస్సింగ్‌ రూమ్‌కి వెళ్లాడు. ఈ అంశంపై ఆ జట్టు ఆటగాడైన మనోజ్‌ తివారి స్పందించాడు. జాతీయ క్రికెట్‌ జట్టు సెలక్షన్‌ కమిటీలో ఒకరైన దేవాంగ్.. డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి ఎందుకు రావాల్సి వచ్చిందని నిలదీశాడు. ఈ వివాదంపై ఫిర్యాదు చేసి అతడిని అక్కడ నుంచి పంపించి వేశారు.

"‘మేము అవినీతి నిరోధక కోడ్‌ను ఫాలో కావాలి. జాతీయ సెలక్టరైన దేవాంగ్‌ గాంధీ.. అదికారిక సమాచారం లేకుండా డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి రాకూడదు. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆటగాళ్లతో పాటు జట్టుకు సంబంధించిన సిబ్బంది మాత్రమే ఉండాలి. ఈ విషయాన్ని దేవాంగ్‌ ఎందుకు అతిక్రమించాల్సి వచ్చింది."
- మనోజ్​ తివారి, బంగాల్​ జట్టు ఆటగాడు.


ఈ విషయంపై స్పందించిన దేవాంగ్​ గాంధీ.. అంపైర్​, అవినీతి నిరోధ విభాగం నుంచి తాను అనుమతి పొందినట్లు స్పష్టం చేశాడు.

ఇదీ చదవండి:- బాక్సింగ్​ డే టెస్టుకు రికార్డు వీక్షకుల హాజరు

ABOUT THE AUTHOR

...view details