145.. 126 నాటౌట్.. 152.. 97.. 52..! విజయ్ హజారే టోర్నీలో కర్ణాటక యువ కెరటం దేవ్‌దత్ పడిక్కల్ చెలరేగుతున్న తీరిది. మ్యాచ్ మ్యాచ్‌కు ధాటి పెంచుతున్న ఈ లెఫ్ట్ హ్యాండర్.. ఐపీఎల్ ముంగిట మరోసారి చెలరేగిపోయాడు. టీ20 ఫార్మాట్లో మాదిరిగా మెరుపులు మెరిపించాడు. పడిక్కల్ (145 నాటౌట్, 125 బంతుల్లో 9*4, 9*6) వరుసగా మూడో శతకు బాదాడు. దీంతో ఈ టోర్నీలో కర్ణాటక మరో విజయాన్ని అందుకుంది. గ్రూప్-సి మ్యాచ్‌లో జట్టు 10 వికెట్ల తేడాతో రైల్వేస్‌ను చిత్తు చేసింది.
మొదట రైల్వేస్ 284/9 స్కోరు చేసింది. ప్రతామ్ సింగ్ (129) సెంచరీ చేశాడు. చేదనలో దేవ్‌దత్, మరో ఓపెనర్ రవికుమార్ (130 నాటౌట్) అజేయ సెంచరీలు చేయగా కర్ణాటక 40.3 ఓవర్లలో వికెట్ కోల్పోడుండా లక్ష్యాన్ని అందుకుంది. 60 బంతుల్లో అర్ధసెంచరీ చేసిన పడిక్కల్.. తర్వాత 34 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసేశాడు. ఈ టోర్నీలో కేరళపై 126 పరుగులతో అజేయంగా నిలిచిన ఈ లెఫ్ట్ హ్యాండర్.. ఒడిషా పై 152 పరుగులు సాధించాడు. బీహార్ పై (97 పరుగులు) కొద్దిలో శతకం కోల్పో యాడు. మొత్తం మీద 5 మ్యాచుల్లో 190.66 సగటుతో 572 పరుగులు చేసిన పడిక్కల్.. అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మెన్ జాబితాలో ముందున్నాడు. ప్రస్తుతం కర్ణాటక 5 మ్యాచుల్లో నాలుగో విజయాన్ని నమోదు చేసి 16 పాయింట్లతో గ్రూప్-సి ఆగ్రస్థానంతో నాకౌట్ బెర్తును ఖరారు చేసుకుంది