ప్రస్తుతం ఉన్న భారత జట్టు ఆటగాళ్లు, నిర్వహణ సభ్యుల మధ్య సరైన స్థాయిలో సంభాషణ జరగట్లేదని అన్నాడు భారత మాజీ ఆటగాడు, క్రికెట్ సలహా మండలి సభ్యుడు మదన్ లాల్. రోహిత్ శర్మ ఎంపిక, ఆస్ట్రేలియాలో భారత జట్టు ప్రదర్శనను ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేశాడు.
రోహిత్ శర్మకు గాయాలయ్యాయని వచ్చిన వార్తపై స్పష్టత లేదన్నాడు మదన్ లాల్. రోహిత్.. చివరి మూడు ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడడమే ఇందుకు నిదర్శనమని తెలిపాడు.
" తమ జట్టు ఆటగాళ్ల గురించి కెప్టెన్‌కు, కోచ్‌కు తప్పనిసరిగా అవగాహన ఉండాలి. 70 శాతం మాత్రమే ఫిట్‌గా ఉన్నా.. రోహిత్ చివరి మూడు ఐపీఎల్ మ్యాచ్‌ల్లో ఎలా ఆడాడనేదానిపై ముంబయి ఫ్రాంఛైజీ లేదా రోహిత్ శర్మనే స్పష్టత ఇవ్వాలి. జట్టు ఆటగాళ్లకు, నిర్వహణ కమిటీ సభ్యులకు మధ్య సరైన సంభాషణ జరగాలి. ఏం జరుగుతుందనే దానిపై స్పష్టత అవసరం".
-మదన్ లాల్, క్రికెట్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు.