తెలంగాణ

telangana

ETV Bharat / sports

సస్పెన్షన్​కు చేరువలో విరాట్ కోహ్లీ

ఇప్పటికే రెండు డీమెరిట్ పాయింట్లతో ఉన్న విరాట్ కోహ్లీ మరో పాయింట్​ను ఖాతాలో వేసుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ-20లో దక్షిణాఫ్రికా బౌలర్​ హెండ్రిక్స్​ను భుజంతో తోసిన కారణంగా విరాట్​కు హెచ్చరిక జారీ చేసింది ఐసీసీ.

విరాట్ కోహ్లీ

By

Published : Sep 23, 2019, 7:53 PM IST

Updated : Oct 1, 2019, 6:01 PM IST

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మైదానంలో కొంచెం దూకుడుగా కనిపిస్తాడనేది అందరికి తెలిసిందే. తన ఉత్సాహంతో అప్పుడు అప్పుడు క్రమశిక్షణా ఉల్లంఘన చర్యలకు గురైన సందర్భాలూ ఉన్నాయి. తాజాగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ-20 మ్యాచ్​లో దురుసుగా ప్రవర్తించిన కారణంగా ఓ డీమెరిట్ పాయింట్​ను ఖాతాలో వేసుకున్నాడీ ఆటగాడు.

దక్షిణాఫ్రికా బౌలర్ బ్యూరో హెండ్రిక్స్​ ఓవర్లో పరుగుకు ప్రయత్నించిన విరాట్​ అతడిని నెట్టుకుంటూ వెళ్లాడు. నియమాలను ఉల్లంఘించిన కారణంగా ఐసీసీ .. కోహ్లీకి ఓ డీమెరిట్ పాయింట్​ను విధించింది.

ఇప్పటికే రెండుసార్లు క్రమశిక్షణా ఉల్లంఘనకు పాల్పడిన కోహ్లీ తాజాగా మూడో పాయింట్​ను ఖాతాలో వేసుకున్నాడు. ఇంకొక్క పాయింట్​ చేరితే అతడిపై వేటు పడే అవకాశముంది. గతేడాది జనవరిలో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్​లో ఒకటి, ప్రపంచకప్​లో​ అఫ్గానిస్థాన్ మ్యాచ్ సందర్భంలో రెండో డీమెరిట్ పాయింట్ విరాట్ ఖాతాలో చేరాయి.

24 నెలల సమయంలో ఓ ఆటగాడి ఖాతాలో 4 డీమెరిట్ పాయింట్లు చేరితే అతడిపై ఓ టెస్టు లేదా, 2 వన్డేలు లేదా 2 టీ-20 (వీటిలో ఏది ముందు వస్తే ఆ మ్యాచ్​) నిషేధం ఎదుర్కొంటాడు.

చదవండి: ట్రంప్​ మాటతో ఎన్​బీఏ పోటీలకు గిరాకీ !

Last Updated : Oct 1, 2019, 6:01 PM IST

ABOUT THE AUTHOR

...view details