టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 13 పరుగుల వద్ద రాహుల్ (12) వికెట్ కోల్పోయింది. గేల్ మాత్రం తనదైన శైలి ఆటతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. మయాంక్ అగర్వాల్ (2), మిల్లర్ (7), సామ్ కరన్ (0), అశ్విన్ (16) విఫలమయ్యారు. మన్దీప్ సింగ్ (30) చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో హర్‌ప్రీత్ 12 బంతుల్లో 20 పరుగులు చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు.
గేల్ మెరుపుల్.. దిల్లీ లక్ష్యం 164 పరుగులు - delhi capitals
దిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు సాధించింది. గేల్ మరోసారి మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు.
ఐపీఎల్
గేల్ జిగేల్..
గేల్ బౌండరీలతో ఫిరోజ్ షా కోట్లా స్టేడియం చిన్నబోయింది. బంతిని బౌండరీ దాటించడమే లక్ష్యంగా చెలరేగిన ఈ విండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మెన్ 37 బంతుల్లోనే 5 సిక్సులు 6 ఫోర్లతో 69 పరుగులు సాధించాడు. స్కోర్ పెంచే క్రమంలో భారీ షాట్ ఆడగా బౌండరీ లైన వద్ద కొలిన్ ఇంగ్రామ్ అద్భుత క్యాచ్‌తో గేల్ పెవిలియన్ బాట పట్టాడు.
దిల్లీ బౌలర్లలో సందీప్ లామిచానే 3 వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్, రబాడ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు.