దిల్లీ క్యాపిటల్స్ శిబిరంలో కరోనా కేసు నిర్ధరణ అయింది. జట్టు ఫిజియోథెరపిస్ట్ సహాయకులలో ఒకరికి కొవిడ్ సోకినట్లు మూడోసారి చేసిన పరీక్షల్లో తేలింది. యూఏఈకి చేరుకున్న తర్వాత ఇప్పటివరకు మూడు పరీక్షలు జరిపామని తొలి రెండింట్లో నెగెటివ్ వచ్చినా సరే, మూడోసారి చేసిన పరీక్షల్లో అతడికి పాజిటివ్‌గా వచ్చినట్లు దిల్లీ ఫ్రాంఛైజీ వెల్లడించింది.
ఐపీఎల్: దిల్లీ క్యాపిటల్స్ ఫిజియోకు కరోనా - ఢిల్లీ క్యాపిటల్స్ న్యూస్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను కరోనా భయం వెంటాడుతోంది. తొలుత చెన్నై సూపర్‌కింగ్స్‌లో క్రికెటర్లతో పాటు సిబ్బందికి కరోనా సోకగా.. ఇప్పుడు దిల్లీ క్యాపిటల్స్‌లోనూ కొవిడ్ కేసు నిర్ధరణ అయింది.
"అతడు ఇంకా జట్టుతో కలవలేదు. ఫ్రాంఛైజీకి సంబంధించిన ఏ ఆటగాడు లేదా సిబ్బందితో సన్నిహితంగా లేడు. అతడు దుబాయ్‌లోని ఐపీఎల్ ఐసోలేషన్ కేంద్రంలో 14 రోజుల పాటు నిర్బంధంలో ఉంటాడు. మా వైద్య బృందం పర్యవేక్షిస్తుంది. అతడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం" -దిల్లీ క్యాపిటల్స్ ప్రకటన
ఐపీఎల్లో కరోనా కేసు వచ్చిన మూడో జట్టుగా దిల్లీ క్యాపిటల్స్ నిలిచింది. అంతకు ముందు చెన్నై సూపర్‌కింగ్స్‌లోని ఇద్దరు ఆటగాళ్లతో పాటు 13 మంది సిబ్బందికి పాజిటివ్‌గా తేలింది. యూఏఈ ప్రయాణానికి ముందే రాజస్థాన్ రాయల్స్ ఫీల్డింగ్ కోచ్ దిశాంత్కు వైరస్ సోకింది. 14 రోజుల ఐసోలేషన్ తర్వాత తిరిగి ఆతిథ్య దేశం వెళ్లేందుకు అనుమతి పొందాడు.