తెలంగాణ

telangana

ETV Bharat / sports

మెరిసిన రబాడ.. దిల్లీ లక్ష్యం 150 పరుగులు - bangaluru royal challengers

బెంగళూరు వేదికగా దిల్లీతో జరుగుతున్న మ్యాచ్​లో రాయల్ ఛాలెంజర్స్ జట్టు 149 పరుగులు చేసింది. సారథి విరాట్​ 41 పరుగులతో టాప్​స్కోరర్​గా నిలిచాడు. దిల్లీ బౌలర్​ కగిసో రబాడ 4 వికెట్లతో ఛాలెంజర్స్​ పతనాన్ని శాసించాడు.

దిల్లీ జట్టు

By

Published : Apr 7, 2019, 5:52 PM IST

5 వరుస ఓటములతో ప్లే ఆఫ్​ ఆశలు సంక్లిష్టం చేసుకున్న విరాట్ సేన.. ఈ మ్యాచ్​లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్​కు దిగింది. ప్రారంభంలోనే పార్థివ్ పటేల్ (9) వికెట్ కోల్పోయింది. డివిలియర్స్ (17), స్టాయినిస్ (15) కూడా భారీ స్కోర్లు చేయకుండానే వెనుదిరిగారు. మొయిన్ అలీ 18 బంతుల్లో 32 పరుగులతో కొద్దిగా దూకుడుగా ఆడాడు. సారథి కోహ్లీ 33 బంతుల్లో 41 పరుగులు చేసి బెంగళూరు ఆ మాత్రం స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు.

దిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. వరుసగా వికెట్లు తీస్తూ ప్రత్యర్థి బ్యాట్స్​మెన్ పై ఒత్తిడి పెంచడంలో సఫలమయ్యారు. రబాడ 4 వికెట్లతో ఆకట్టుకున్నాడు. ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసి బెంగళూరు పతనాన్ని శాసించాడు. క్రిస్ మోరిస్ రెండు, అక్షర్ పటేల్, సందీప్​ చెరో వికెట్ తీశారు.

ABOUT THE AUTHOR

...view details