ఆడిన పది మ్యాచ్‌ల్లో ఆరింటిలో గెలిచి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది దిల్లీ క్యాపిటల్స్. మూడింటిలో మినహా మిగిలిన మ్యాచ్‌ల్లో ఓడి దిగువ నుంచి రెండో స్థానంలో ఉంది రాజస్థాన్. ఈ రెండింటి మధ్య జైపుర్ వేదికగా నేడు మ్యాచ్ జరగుతోంది. మొదటగా టాస్ గెలిచిన దిల్లీ బౌలింగ్ ఎంచుకుంది.
గత మ్యాచ్‌లో రహానే నుంచి స్మిత్ సారథ్యం బాధ్యతలు తీసుకున్నాడు. జట్టుకు విజయాన్ని అందించాడు. ముంబయిపై జరిగిన మ్యాచ్‌లో అర్ధశతకంతో అటు బ్యాటింగ్‌లోనూ మెప్పించాడు. మరోవైపు సొంతగడ్డపై వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిన దిల్లీ.. పంజాబ్‌ను ఓడించి జోరుమీదుంది.