వచ్చే ఐపీఎల్ సీజన్‌లో టీమిండియా క్రికెటర్ అజింక్య రహానే.. దిల్లీ క్యాపిటల్స్‌కు ఆడనున్నాడు. ఐపీఎల్-2020 సీజన్ కోసం జరిగిన ట్రేడింగ్ విండో పద్ధతికి గురువారమే చివరిరోజు. డిసెంబర్ 19న కోల్‌కతాలో ఐపీఎల్ వేలం జరగనుంది.
వచ్చే ఏడాది ఐపీఎల్లోరహానే.. దిల్లీ క్యాపిటల్స్‌కు ఆడనున్నట్లు ఇరు ఫ్రాంఛైజీలు స్పష్టం చేశాయి. ఫలితంగా రహానే - రాయల్స్ మధ్య 100 మ్యాచ్‌ల అనుబంధానికి తెరపడింది.
2011లో ముంబయి ఇండియన్స్ నుంచి రాజస్థాన్‌కు మారిన రహానే అప్పట్నుంచి ఇదే ఫ్రాంఛైజీకి ఆడుతున్నాడు. 2012 సీజన్‌లో రాజస్థాన్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా నిలిచాడు. ఈ ఆటగాడికి బదులుగా రాజస్థాన్.. మయాంక్ మార్కండే, రాహుల్ తెవాటియాలను తీసుకుంది.
2008 ఆరంభ సీజన్‌లో టైటిల్ విజేతగా నిలిచిన రాజస్థాన్ రాయల్స్.. మరో ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకోలేకపోయింది. ఐపీఎల్ బదిలీ తేదీ ముగిసిన తర్వాత మరి కొంతమంది ఆటగాళ్లను విడుదల చేసేందుకు సిద్ధమైంది రాజస్థాన్. ఈ జాబితాలో స్టువర్ట్ బిన్నీ, లివింగ్ స్టోన్, ఆష్టన్ టర్నర్, జయదేవ్ ఉనద్కత్‌లు ఉన్నారు.
ఇవీ చూడండి.. టీమిండియా జోరు.. బంగ్లా ఆలౌట్.. భారత్ 86/1