తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్: దిల్లీ క్యాపిటల్స్ పగ్గాలు శ్రేయస్​కే.. - ipl

వచ్చే ఐపీఎల్​లో దిల్లీ క్యాపిటల్స్​కు సారథిగా మరోసారి బాధ్యతలు నిర్వర్తించనున్నాడు శ్రేయస్ అయ్యర్. ఈ మేరకు యాజమాన్యం ట్విట్టర్​లో ఓ వీడియో పోస్ట్ చేసింది. దీనిపై శ్రేయస్ సంతోషం వ్యక్తం చేశాడు.

శ్రేయస్

By

Published : Nov 19, 2019, 12:27 PM IST

వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్​ ఆటగాళ్ల బదిలీలకు సంబంధించి గడువు ముగిసింది. పలు ఫ్రాంఛైజీలు కొంతమంది ఆటగాళ్లను ట్రేడింగ్ ద్వారా సొంతం చేసుకున్నాయి. ట్రేడింగ్‌లో భాగంగా దిల్లీ క్యాపిటల్స్ సీనియర్ ఆటగాళ్లు అజింక్యా రహానే, రవిచంద్రన్ అశ్విన్‌లను సొంతం చేసుకుంది. ఈ కారణంగా కెప్టెన్సీపై పలు వార్తలు వచ్చాయి. రహానే, అశ్విన్​లలో ఎవరికో ఒకరికి బాధ్యతలు అప్పజెప్పుతారన్న పుకార్లు వినిపించాయి. వీటన్నింటిపై దిల్లీ యాజమాన్యం స్పష్టత ఇచ్చింది.

దిల్లీ క్యాపిటల్స్ తన ట్విట్టర్‌ ఖాతాలో ఓ వీడియోని పోస్టు చేస్తూ " మా కెప్టెన్ ఫెంటాస్టిక్, వచ్చే సీజన్‌ కోసం ఎంతో ఆత్రుతగా ఉన్నాడు. అనుభవజ్ఞులైన సూపర్ స్టార్లను జట్టులో చేర్చాం. అలాగే త్వరలో వేలం జరగబోతుంది కాబట్టి.. మన కెప్టెన్ అద్భుతమైన జట్టుని అన్ని విధాలా నడిపించగలడా?" అంటూ చెప్పుకొచ్చింది.

ఆ వీడియోలో అశ్విన్, రహానే లాంటి సీనియర్ ఆటగాళ్లు జట్టుతో చేరడాన్ని సంతోషం వ్యక్తం చేసి శ్రేయాస్ అయ్యర్, వేలం కోసం తాను ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నానని.. వచ్చే సీజన్‌లో తన కెప్టెన్సీలో దిల్లీ టైటిల్‌ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. గత సీజన్‌లో క్యాపిటల్స్ అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ టైటిల్‌ ముంగిట బోల్తా పడింది.

ఇవీ చూడండి..'కోహ్లీ, డివిలియర్స్ ఆడితేనే మ్యాచ్​లు గెలవలేం'

ABOUT THE AUTHOR

...view details