తెలంగాణ

telangana

ETV Bharat / sports

దిల్లీ జట్టు సలహాదారుడిగా గంగూలీ - shreyas ayyer

ఐపీఎల్​లో దిల్లీ క్యాపిటల్స్ జట్టు సలహాదారుడిగా టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీ నియమితులయ్యారు. కోచ్ పాంటింగ్​తో కలిసి టీం బాధ్యతలు చూసుకోనున్నారు.

"దిల్లీ జట్టు సలహాదారుడిగా గంగూలీ"

By

Published : Mar 14, 2019, 3:53 PM IST

టీమిండియా మాజీ సారథి గంగూలీ ఐపీఎల్​లో కనిపించనున్నాడు. ఈ సీజన్ మొత్తం దిల్లీ క్యాపిటల్స్ జట్టుకు సలహాదారుడిగా పనిచేయనున్నాడు. కోచ్​గా పాంటింగ్, కెప్టెన్​గా శ్రేయస్ అయ్యర్ తమ బాధ్యతలు నిర్వహించనున్నారు.

దిల్లీ క్యాపిటల్స్ జట్టుతో పనిచేయడం ఆనందంగా ఉంది. ఆటగాళ్లు, సిబ్బందితో పని చేసేందుకు ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నాను ---సౌరవ్ గంగూలీ

గంగూలీ అనుభవం దిల్లీ జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. ఆయన మా కుటుంబ సభ్యుడి లాంటి వాడు. జట్టుకు అతను సలహాదారుడిగా నియమితులవడం సంతోషమైన విషయం ----పార్థ్ జిందాల్, దిల్లీ క్యాపిటల్స్ ఛైర్మన్

ఈనెల 24న వాంఖడే స్టేడియంలో జరిగే తొలి మ్యాచ్​లో ముంబయి ఇండియన్స్​తో తలపడనుంది దిల్లీ క్యాపిటల్స్. మార్చి 26న సొంత మైదానం ఫిరోజ్ షా కోట్లాలో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నైని ఢీకొట్టనుంది. 11 సీజన్లలో ఇంతవరకు ఈ జట్టు కప్పు గెలవలేదు.

ABOUT THE AUTHOR

...view details