టీమ్ఇండియా మాజీ క్రికెటర్, భాజపా ఎంపీ గౌతమ్ గంభీర్ తండ్రి దీపక్ గంభీర్‌కు చెందిన ఓ కారును ఎత్తుకెళ్లాడు దొంగ. ఈ ఘటన గురువారం రాత్రి దిల్లీ రాజేంద్రనగర్లోని తమ ఇంటి ముందు జరిగినట్లు గౌతీ కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. ఇంటిముందు పెట్టిన కారు, ఉదయం చూసేసరికి కనిపించలేదని పోలీసులకు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకుని, నిందుతుడి కోసం వెతుకున్నారు. చుట్టుపక్కల సీసీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నట్లు చెప్పారు.
మాజీ క్రికెటర్ గంభీర్ ఇంట్లో కారు చోరీ - autam Gambhir father car news
మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఇంట్లో కారునే ఎత్తుకెళ్లాడు ఓ దొంగ. అతడి తండ్రి ఉపయోగిస్తున్న ఆ వాహనం చోరీకి గురైందని శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు చేశారు.
మాజీ క్రికెటర్ గంభీర్ ఇంట్లో కారునే ఎత్తుకెళ్లిన దొంగ!