తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఆలస్యం చేస్తే ఎవ్వరికీ ఉపయోగం ఉండదు' - T20 worldcup 2020 news

టీ20 ప్రపంచకప్ నిర్వహణపై తుది నిర్ణయాన్ని త్వరగా ప్రకటించాలని ఐసీసీకి విజ్ఞప్తి చేశాడు బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్​. వీలైనంత త్వరగా ఓ ప్రకటన చేస్తే దానికి అనుగుణంగా సభ్య దేశాల క్రికెట్​ బోర్డులు ప్రణాళికలు రూపొందించుకుంటాయని వెల్లడించాడు.

Delay in decision-making at ICC not helping anyone, says BCCI treasurer Arun Dhumal
'ఆలస్యం చేస్తే ఎవ్వరికి ఉపయోగం ఉండదు'

By

Published : Jun 11, 2020, 9:09 PM IST

టీ20 ప్రపంచకప్​ నిర్వహణపై తుది నిర్ణయాన్ని ఐసీసీ ఆలస్యం చేయడం పట్ల బీసీసీఐ కోశాధికారి అరుణ్​ ధుమాల్​ అసహనం వ్యక్తం చేశాడు. ఇలాంటి విషయాల్లో ఆలస్యం చేయడం వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదని అభిప్రాయపడ్డాడు.

"కరోనా మహమ్మారి కారణంగా క్రికెట్​ టోర్నీలు నిర్వహించడం సవాలుగా మారింది. ఈ సమయంలో నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం చేయడం వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదు. అవసరమైన వాటి కోసం త్వరగా ఓ నిర్ణయానికి రండి. ఎందుకంటే ఈ టోర్నీ ప్రణాళికపై ఇతర దేశాల క్రికెట్​ ప్రణాళికలు ఆధారపడి ఉన్నాయి."

- అరుణ్​ ధుమాల్​, బీసీసీఐ కోశాధికారి

టోర్నీ నిర్వహణపై తుది నిర్ణయం వెల్లడించకుండా అంతర్జాతీయ క్రికెట్​ మండలి (ఐసీసీ) కాలయాపన చేస్తుందని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బుధవారం జరిగిన సమావేశంలో అంశాలన్నింటిపై పూర్తిగా చర్చ జరగని కారణంగా సోమవారం తిరిగి మళ్లీ సమావేశాన్ని నిర్వహించనుంది ఐసీసీ.

తొలుత ఈ-మెయిల్స్​ బహిర్గతం అవ్వడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ సమావేశాన్ని ఆలస్యం చేసింది ఐసీసీ. అలాగే బీసీసీఐతో ఉన్న పన్ను పరిష్కారాలతో పాటు మరికొన్ని సమస్యలపై బుధవారం చర్చ జరిగింది.

ఇదీ చూడండి...'ఐపీఎల్​లో మార్పులకు మేము వ్యతిరేకం'

ABOUT THE AUTHOR

...view details