తెలంగాణ

telangana

ETV Bharat / sports

దీపక్​ చాహర్​ ట్రైనింగ్​ షురూ : సీఎస్కే - Deepak chahar

కరోనాను జయించిన చెన్నై సూపర్​ కింగ్స్​ ఆటగాడు​ దీపక్​ చాహర్​.. జట్టుతో కలవడానికి బీసీసీఐ నుంచి అనుమతి లభించింది. శుక్రవారం నుంచి అతడు ప్రాక్టీసు ప్రారంభించాడు.

Deepak chaha
దీపక్​ చాహర్

By

Published : Sep 11, 2020, 8:17 PM IST

కరోనా నుంచి కోలుకున్న చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు దీపక్​ చాహర్​.. జట్టులో చేరడానికి బీసీసీఐ అనుమతిచ్చింది. ఫలితంగా అతడు శుక్రవారం నుంచి సాధన ప్రారంభించాడు. దీంతో సీఎస్కేకు ఊరట లభించినట్లైంది. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ సీఈఓ కాశీ విశ్వనాథన్​ వెల్లడించారు.

ఐపీఎల్​ కోసం దుబాయ్​ చేరుకున్న సీఎస్కేలో చాహర్​, రుతురాజ్​ గైక్వాడ్​ సహా మరో 11మందికి కరోనా సోకింది. దీంతో అందరూ క్వారంటైన్​లో ఉన్నారు. అనంతరం రెండు సార్లు చేసిన కరోనా వైరస్​ నిర్ధరణ పరీక్షల్లో చాహల్​కు నెగిటివ్​గా తేలింది. దీంతో అతడు బయోబబుల్​లోకి అడుగుపెట్టాడు. కానీ బీసీసీఐ నిబంధనల ప్రకారం నెగిటివ్ వస్తే కార్డియో వాస్కులర్​ పరీక్ష చేయించుకోవాలి. తాజాగా సదరు పరీక్ష చేయించుకున్న చాహర్​కు సానుకూల ఫలితం రావడం వల్ల.. అతడు జట్టులో చేరడానికి భారత క్రికెట్​ బోర్డు అనుమతిచ్చింది.

కరోనా సోకిన మరో ఆటగాడు రుతురాజ్​ గైక్వాడ్​కు శనివారం రెండో రౌండ్​ వైరస్​ పరీక్షలు చేయించనున్నారు. ఇందులో నెగిటివ్​ తేలితేనే బుడగలోకి అడుగుపెడతాడు గైక్వాడ్​.

ఇదీ చూడండి ఐపీఎల్2020: ఆర్​సీబీ బలాలు, బలహీనతలు ఇవే!

ABOUT THE AUTHOR

...view details