తెలంగాణ

telangana

ETV Bharat / sports

'రైనా మళ్లీ వస్తాడు.. భజ్జీ స్థానం భర్తీ చేయడం కష్టం' - రైనా దీప్​దాస్ గుప్తా

వ్యక్తిగత కారణాల వల్ల ఈ సీజన్​కు దూరమవుతున్నట్లు తెలిపాడు చెన్నై సూపర్ కింగ్స్ ఆల్​రౌండర్ సురేశ్ రైనా. అయితే అతడు మళ్లీ లీగ్​కి వస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు టీమ్​ఇండియా మాజీ క్రికెటర్ దీప్​దాస్ గుప్తా.

'రైనా మళ్లీ వస్తాడు
'రైనా మళ్లీ వస్తాడు

By

Published : Sep 6, 2020, 9:28 PM IST

ఈ ఐపీఎల్‌ 13వ సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ సురేశ్‌ రైనా మళ్లీ వచ్చి కచ్చితంగా ఆడతాడని, అయితే ఆరంభంలో కొన్ని మ్యాచ్‌లు ఆడకపోవచ్చని టీమ్‌ఇండియా మాజీ కీపర్‌ దీప్‌దాస్‌ గుప్తా అభిప్రాయపడ్డాడు. గతవారం సీఎస్కే జట్టులో నుంచి సురేశ్‌ రైనా, హర్భజన్‌ సింగ్‌ వ్యక్తిగత కారణాలతో ఈ సీజన్‌కు ఆడటం లేదని వెల్లడించాడు. ఈ నేపథ్యంలో వారి స్థానాలను భర్తీ చేసే విషయంపై స్పందించిన దీప్‌దాస్‌ పైవిధంగా మాట్లాడాడు.

"ఐపీఎల్‌లో రైనా మళ్లీ ఆడతాడనే నమ్మకం నాకుంది. ఐపీఎల్‌ నియమాలు, క్వారంటైన్‌లో ఉండటం, కరోనా పరీక్షలు చేయించుకోవడం లాంటివాటితో మొదట్లో కొన్ని మ్యాచ్‌లు ఆడకపోవచ్చు. అయితే, తర్వాత మాత్రం ఆడతాడని విశ్వసిస్తున్నా. అలాగే చెన్నై సూపర్ కింగ్స్‌ అతడి స్థానాన్ని వేరే ఆటగాడితో భర్తీ చేయకపోయినా నేను ఆశ్చర్యపోను."

-దీప్​దాస్ గుప్తా, టీమ్​ఇండియా మాజీ క్రికెటర్

ఇక సీనియర్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ నిష్క్రమణపై స్పందిస్తూ.. అతడి స్థానాన్ని భర్తీ చేయడంలో సీఎస్కేకు ఎక్కువ అవకాశాలు లేవన్నాడు దీప్​దాస్. అయితే, దేశవాళీ క్రికెట్‌లో రాణిస్తున్న జలజ్‌ సక్సేనా అనే యువ ఆల్‌రౌండర్‌ను తీసుకుంటే సరిగ్గా సరిపోతాడని తెలిపాడు. ధోనీ జట్టు అతడిని పరిశీలించే అవకాశం ఉందని, భజ్జీ స్థానాన్ని భర్తీ చేయగలడని ధీమా వ్యక్తం చేశాడు.

ABOUT THE AUTHOR

...view details