ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో విజయవంతమైన జట్లలో చెన్నై సూపర్‌కింగ్స్ అగ్రస్థానంలో ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మూడుసార్లు విజేతగా నిలవడం సహా ఎనిమిది సార్లు ఫైనల్స్ ఆడింది. ఈ ఘనతంతా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకే దక్కుతుంది. ఒకవేళ అతడు సారథిగా తప్పుకుంటే జట్టును నడిపించేది ఎవరు? ఈ సందేహం ప్రతి అభిమానికి ఉండొచ్చు. మహీ కూడా సారథిగా తప్పుకోవాలని అనుకుంటున్నట్లు సీఎస్కే ఆల్‌రౌండర్ డ్రేన్ బ్రావో చెప్పాడు. వచ్చే సీజన్ నుంచి ధోనీ ఆటగాడిగానే కొనసాగొచ్చని తెలిపాడు. సురేశ్ రైనా లేదా యువ ఆటగాళ్లకు జట్టు పగ్గాలు అప్పచెప్పాలని మహీ భావిస్తున్నట్లు పేర్కొన్నాడు.
కెప్టెన్సీకి ధోనీ టాటా.. కొత్త సారథి ఎవరంటే?
వచ్చే ఐపీఎల్లో ధోనీ కేవలం ఆటగాడినే కనిపించనున్నాడా? అంటే అవుననే అంటున్నాడు ఆల్‌రౌండర్ బ్రావో. కెప్టెన్సీ నుంచి తప్పుకుని కొత్త వాళ్లకు ఆ బాధ్యతలు అందజేయాలనుకుంటున్నట్లు వెల్లడించాడు.
ధోనీ
అంతర్జాతీయ క్రికెట్‌కు ఆగస్టు 15న వీడ్కోలు పలికాడు ధోనీ. దాదాపు 16 ఏళ్ల పాటు జట్టుకు సేవలందిచాడు. కెప్టెన్‌గా, ఆటగాడిగా ఎన్నో విజయాలను అందించాడు. ఐపీఎల్లో ఆడేందుకు దుబాయ్‌లో ఉన్న మహీ.. క్వారంటైన్ పూర్తిచేసుకుని ప్రాక్టీసు చేస్తున్నాడు.
ఇదీ చూడండి స్మిత్ ఆవలింతపై సర్ఫరాజ్ భార్య ట్వీట్