ఐపీఎల్ వల్లే ప్రపంచకప్‌లో మంచి ప్రదర్శన చేయలేకపోయామని గతంలో అన్నాడు దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్. ఆ వ్యాఖ్యలు మరువకముందే మరో సఫారీ క్రికెటర్.. భారత్ గురించి నోరు పారేసుకున్నాడు. ఇక్కడ హోటళ్లలో సరైన ఆహారం దొరకడం లేదని, ఆ ప్రభావం తమ ప్రదర్శనపై పడుతోందని డీన్ ఎల్గర్ అన్నాడు. అతడి వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఆడటం చేతకాక ఆరోపణలు చేస్తున్నాడంటూ ట్రోల్ చేస్తున్నారు.
"ఈ పర్యటనలో మాకు చాలా సవాళ్లు ఎదురయ్యాయి. ఇక్కడ క్రికెటర్‌గానే కాకుండా వ్యక్తిగతంగానూ ఇబ్బంది పడుతున్నాం. చిన్న ప్రాంతాలకు వచ్చినపుడు అక్కడు హోటళ్లలో ఆహారం అంత బాగుండక పోవచ్చు. అలాంటి సమయాల్లో మైదానంలో ఆ ప్రభావం కనిపిస్తుంది" - డీన్ ఎల్గర్, దక్షిణాఫ్రికా క్రికెటర్.