ప్రస్తుతం పాకిస్థాన్‌లో జరుగుతున్న సిరీస్ తర్వాత టెస్టు కెప్టెన్సీ నుంచి క్వింటాన్ డికాక్‌ను తప్పిస్తామని దక్షిణాఫ్రికా జట్టు కోచ్ మార్క్ బౌచర్ స్పష్టం చేశాడు. ఈ అదనపు బాధ్యత అతని బ్యాటింగ్‌పై ప్రభావం చూపిస్తుందని మార్క్ పేర్కొన్నాడు. తమతో టెస్టు సిరీస్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా వాయిదా వేయడం నిరాశ కలిగించిందని అసంతృప్తి వ్యక్తం చేశాడు.
దక్షిణాఫ్రికాలో కరోనా వ్యాప్తి దృష్ట్యా ఆస్ట్రేలియా తమ పర్యటనను వాయిదా వేసుకుంది. దీంతో వచ్చే తొమ్మిది నెలల్లో మాకు టెస్టు సిరీస్‌లు లేవు. పాకిస్థాన్ నుంచి స్వదేశానికి తిరిగి రాగానే మాకు కొంచెం సమయం ఉంటుంది. కూర్చొని మాట్లాడుకుంటాం. టెస్టు కెప్టెన్‌గా ఎవరు సమర్థుడనే విషయాన్ని తేలుస్తాం. ఫలితంగా డికాక్‌పై ఉన్న అదనపు బాధ్యతలు తొలగిస్తాం.
-మార్క్ బౌచర్, దక్షిణాఫ్రికా కోచ్.
2020 వేసవిలో క్విన్నీని తాత్కాలిక టెస్టు కెప్టెన్‌గా నియమించారు.
"అది అతనిపై అదనపు భారం అవుతుంది. ప్రస్తుత పాకిస్థాన్ సిరీస్‌లో అతడు ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నాడు. తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 15, 2 పరుగులు మాత్రమే చేశాడు. బ్యాటింగ్‌లో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయకపోతే అందరి దృష్టిలో పడతాం. కెప్టెన్‌గా ఉన్నప్పుడు అది ఇంకా ఎక్కువగా ఉంటుంది" అని బౌచర్ తెలిపాడు.