తెలంగాణ

telangana

By

Published : Nov 27, 2019, 7:53 AM IST

ETV Bharat / sports

భారత మాజీ క్రికెటర్ గంభీర్​కు అరుదైన గౌరవం

టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్​కు అరుదైన గౌరవం లభించింది. అరుణ్​జైట్లీ స్టేడియంలోని ఓ స్టాండ్​కు గంభీర్ పేరు పెట్టింది డీడీసీఏ. ఈ విషయంపై గౌతీ సంతోషం వ్యక్తం చేశాడు.

Gambhir
గంభీర్

టీమిండియా మాజీ బ్యాట్స్‌మన్, తూర్పు దిల్లీ ఎంపీ గౌతమ్ గంభీర్‌కు అరుదైన గౌరవం దక్కింది. దిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియంలోని ఓ స్టాండ్‌కు డీడీసీఏ గంభీర్‌ పేరు పెట్టింది. ఈ స్టాండ్‌ను మంగళవారం గంభీర్‌ ఆవిష్కరించాడు. దీనికి సంబంధించిన చిత్రాలను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు.

గంభీర్ స్టాండ్

"అరుణ్‌జైట్లీ నాకు తండ్రిలాంటి వారు. అరుణ్‌జైట్లీ స్టేడియంలో ఓ స్టాండ్‌కు నా పేరు పెట్టినందుకు ఎంతో గర్వంగా, ఆనందంగా ఉంది. నాకు అండగా నిలిచినందుకు అపెక్స్‌ కౌన్సిల్‌, స్నేహితులు, అభిమానులు, కుటుంబ సభ్యులకు కతృజ్ఞతలు"
-గంభీర్, టీమిండియా మాజీ ఆటగాడు

దిల్లీకి చెందిన గంభీర్‌.. భారత్‌ తరఫున 58 టెస్టులు, 147 వన్డేలు, 37 టీ20లు ఆడాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో 4,154, వన్డేల్లో 5,238, టీ20ల్లో 932 పరుగులు సాధించాడు. 2007 టీ20 ప్రపంచకప్‌, 2011 ప్రపంచకప్‌ ఫైనల్లో టీమిండియా విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. 2018 డిసెంబర్‌లో క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

ఇవీ చూడండి.. వార్న్ ఫ్రెండైతే.. ఆసీస్ స్లెడ్జింగ్ చేయదు: కుంబ్లే

ABOUT THE AUTHOR

...view details