తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత్​లో 'గులాబీ బంతి' వినియోగం ఇక లాంఛనమే..! - భారత్​లో డే అండ్ నైట్ టెస్టు

గులాబీ బంతి వినియోగంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని అన్నాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ. వారు సమ్మతిస్తే టీమ్​ ఇండియా.. తొలిసారిగా డే అండ్​ నైట్​ టెస్టును వచ్చే నెలలో ఈడెన్ గార్డెన్స్​ వేదికగా ఆడనుంది.

భారత్​లో గులాబీ బంతి ఉపయోగం

By

Published : Oct 28, 2019, 9:47 PM IST

బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ భారత్-బంగ్లాదేశ్ సిరీస్​లో తలపెట్టిన​ డే అండ్ నైట్​ టెస్టు గురించి మాట్లాడాడు. బంగ్లా బోర్డు అంగీకరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. వారి నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని చెప్పాడు.

బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ

"నేను బంగ్లా క్రికెట్ బోర్డు అధ్యక్షుడితో మాట్లాడా. ఆయన ఈ విషయంపై సమ్మతంగా ఉన్నారు. కాకపోతే క్రికెటర్లతో మాట్లాడి నిర్ణయం చెబుతామన్నారు. కచ్చితంగా ఇది డే అండ్ నైట్​ మ్యాచ్​గా జరుగుతుందనేది నా నమ్మకం. వారు త్వరలో దీనిపై అధికారిక ప్రకటన చేయనున్నారు" - సౌరభ్ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు

కోల్​కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా వచ్చే నెల 22 నుంచి 26 వరకు జరగనుందీ టెస్టు మ్యాచ్​. అయితే గులాబీ బంతి విషయమై సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయన్నాడు బంగ్లా బోర్డు క్రికెట్ కార్యకలాపాల డైరక్టర్ అక్రమ్ ఖాన్.

"ఇది మంచి ప్రయత్నమే, కానీ ఇందుకు తగ్గట్లుగా క్రికెటర్లను తయారు చేయాలి. వెలుతురులో గులాబీ బంతితో ప్రాక్టీసు కోసం మాకు రెండు రోజులే(నవంబరు 20,21) ఇచ్చారు. ఇది చాలా తక్కువ సమయం. త్వరలోనే ఈ విషయంపై ఏదో ఒక నిర్ణయం తీసుకోనున్నారు" -అక్రమ్ ఖాన్, బంగ్లా బోర్డు క్రికెట్ కార్యకలాపాల డైరక్టర్

అయితే డే అండ్​ నైట్​ టెస్టును ప్రతి ఏటా ఈడెన్​లో నిర్వహించేలా చూస్తామని చెప్పాడు సౌరభ్ గంగూలీ.

ఎప్పటినుంచో గులాబీ బంతితో ఆడటాన్ని వ్యతిరేకిస్తూ వచ్చారు భారత క్రికెటర్లు. కానీ ఇటీవలే ఈ విషయంపై మాట్లాడిన గంగూలీ.. కెప్టెన్ విరాట్ కోహ్లీ పింక్​బాల్ ఉపయోగించడానికి అంగీకరించినట్టు చెప్పాడు.

ఇది చదవండి: భారత్​-బంగ్లాదేశ్​: ఈడెన్ టెస్టులో 'గులాబీ బంతి'..!

ABOUT THE AUTHOR

...view details