తెలంగాణ

telangana

ETV Bharat / sports

తారక్​కు వార్నర్ 'పక్కా లోకల్' గిఫ్ట్​ - warner sended wishes to NTR by tiktok

టాలీవుడ్​ అగ్రకథానాయకుడు జూనియర్​ ఎన్టీఆర్​ పుట్టినరోజు సందర్భంగా.. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సామాజిక మాధ్యమాల్లో ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. సన్​రైజర్స్​ హైదరాబాద్​ కెప్టెన్​ డేవిడ్​ వార్నర్​ కూడా ఎన్టీఆర్​కు బర్త్​డే విషెస్​ తెలియజేశారు. ఆయన భార్యతో కలిసి 'జనతా గ్యారేజ్'​ సినిమాలోని 'పక్కా లోకల్​' పాటకు స్టెప్పులేశారు వార్నర్​.

David Warner Wishes Jr NTR On His Birthday By Dancing To His Song
యంగ్​టైగర్​ ఎన్టీఆర్​కు వార్నర్​ బర్త్​డే గిఫ్ట్​

By

Published : May 20, 2020, 3:31 PM IST

"పాత్రేదైనా.. ఘట్టమేదైనా నేను దిగనంత వరకే" అంటారు యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌. జన్మతః ఆంగికం, వాచకాలపై పట్టు సాధించిన ఆయన నవరసాలను అట్టే పలికించగలరు. చిరుతపులిలా కదిలే ఎన్‌టీఆర్‌ నృత్యం చేస్తుంటే వేదికగా వెండితెర సరిపోదు.

"మైదానమేదైనా.. బౌలర్‌ ఎవరైనా చితక్కొట్టుడే" అంటారు క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌. ఆయన ఫామ్‌లో ఉన్నాడంటే ప్రత్యర్థులకు వణుకే. మైదానంలో నలువైపులా అలవోకగా షాట్లు ఆడేస్తారు. ఆకలిగొన్న పులిలా సిక్సర్లు బాదేస్తుంటే చిన్న స్టేడియాలు సరిపోవు.

నిజం చెప్పాలంటే వీరిద్దరి రంగాలు వేరు. అభిరుచులూ వేరు. ఐతే వీరిద్దరినీ కలిపే ఉమ్మడి వేదిక హైదరాబాద్‌. ఎన్టీఆర్‌ ఇక్కడే పుట్టి పెరిగారు. క్రికెట్‌ను అమితంగా ఇష్టపడతారు. డేవిడ్‌ వార్నర్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు సారథి. తన మెరుపులతో భాగ్యనగరానికి ఐపీఎల్‌ ట్రోఫీని అందించాడు. బుధవారం యంగ్‌టైగర్‌ పుట్టిన రోజు సందర్భంగా వార్నర్‌ అతడికి ఊహించని బహుమతి అందించారు. సతీసమేతంగా ఎన్టీఆర్‌ పాటకు డ్యాన్స్‌ చేసి అలరించారు.

'జనతా గ్యారేజ్‌' చిత్రంలో ఎన్టీఆర్‌, కాజల్‌ ఆడిపాడిన పాటకు డేవిడ్‌ వార్నర్‌, క్యాండిస్‌ వార్నర్‌ టిక్‌టాక్‌ చేశారు. తమదైన స్టెప్పులతో అదరగొట్టారు. "తారక్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఈ రోజు అద్భుతంగా ఉండాలి. (డ్యాన్స్‌) మేం ఎంతో ప్రయత్నించాం. కానీ నీ నృత్యం అద్భుతం. ఎంతో వేగంగా చేశావ్‌" అని వార్నర్‌ ట్వీట్‌ చేశారు. క్యాండిస్‌తో కలిసి చేసిన వీడియోను జత చేశారు. ఈ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ దానిని రీట్వీట్‌ చేస్తూ "యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌, ది బుల్‌ (వార్నర్‌) కాంబినేషన్‌ ఎలా ఉందంటారు?" అంటూ పోస్ట్ పెట్టింది.

ఇదీ చూడండి.. రానా, మిహీకా ఎంగేజ్​మెంట్ నేడే

ABOUT THE AUTHOR

...view details