ఆడిలైడ్‌లో ఆదివారం శ్రీలంకతో జరిగిన టీ20లో 134 పరుగుల భారీ తేడాతో ఆసీస్ గెలిచింది. ఓపెనర్ వార్నర్ సెంచరీతో అదరగొట్టాడు. అయితే ఈ మ్యాచ్‌కు హాజరైన ఓ చిన్నారి అభిమానికి అనుకోని బహుమతి ఇచ్చాడీ క్రికెటర్.
మ్యాచ్ సందర్భంగా ప్రాక్టీసు చేసిన అనంతరం వార్నర్.. డ్రెస్సింగ్ రూంకు వెళుతూ అక్కడే ఉన్న ఓ చిన్నారి అభిమానికి తన గ్లౌవ్స్ బహుమతిగా ఇచ్చేశాడు. దీనిని ఊహించని ఆ పిల్లాడు ఆశ్చర్యానికి గురయ్యాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.