లాక్‌డౌన్‌తో ఇంట్లోనే ఉన్న ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్.. వరుసపెట్టి టిక్‌టాక్ వీడియోలు చేస్తున్నాడు. తను ఒక్కడే కాకుండా కుటుంబ సభ్యుల్ని అందులో భాగం చేస్తున్నాడు. గతనెలలో టిక్‌టాక్ ఖాతా ప్రారంభించిన వార్నర్.. ఇటీవలే కుమార్తె ఇండీతో కలిసి 'షీలా కీ జవానీ' పాటకు స్టెప్పులేశాడు. ఇప్పుడు భార్య క్యాండీతో కలిసి 'జంబలకిడిపంబ' స్టైల్లో, వేషధారణ మార్చుకుని వీడియో చేశాడు. ఇది ఇప్పుడు వైరల్‌గా మారింది.
వార్నర్ దంపతుల 'జంబలకిడిపంబ' టిక్‌టాక్ - వార్నర్ తాజా వార్తలు
ప్రముఖ బ్యాట్స్‌మన్ వార్నర్.. తన భార్యతో కలిసి చేసిన క్రేజీ టిక్‌టాక్ వీడియో వైరల్‌గా మారింది. సామాజిక మాధ్యమాల్లో అభిమానుల్ని విపరీతంగా అలరిస్తోంది.
భార్య క్యాండీతో డేవిడ్ వార్నర్
ఈ వీడియో మొదట్లో వార్నర్.. ఆసీస్ జెర్సీలో, క్యాండీ స్విమ్ సూట్లో కనిపించారు. చివరకి వచ్చేసరికి క్యాండీ జెర్సీలో, వార్నర్.. స్విమ్ సూట్లో కనిపించి అలరించారు.
ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు సారథ్యం వహిస్తున్న వార్నర్.. లాక్డౌన్ వల్ల ఇంట్లోనే ఉండిపోయాడు. దీంతో అభిమానులను అలరించేందుకు టిక్‌టాక్ వీడియోలు చేస్తున్నాడు.