తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఈసారి కుటుంబంతో కలిసి వార్నర్ సందడి - వార్నర్ తాజా వార్తలు

ఇటీవలే టిక్​టాక్​లో అడుగుపెట్టిన వార్నర్.. కుటుంబంతో కలిసి చేసిన ఓ వీడియోను ఇన్​స్టాలో పంచుకున్నాడు. దీనిపై కామెంట్లు చేస్తున్నారు పలువురు క్రికెటర్లు.

David Warner, Wearing Full Australian Gear, Puts On A Tik Tok video With Family
డేవిడ్ వార్నర్ టిక్​టాక్ వీడియో

By

Published : Apr 26, 2020, 6:15 PM IST

లాక్​డౌన్​తో ఇంట్లోనే ఉన్న ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్​మన్ డేవిడ్ వార్నర్.. కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతున్నాడు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటున్న ఇతడు.. గత నెలలోనే టిక్​టాక్ ఖాతాను ప్రారంభించాడు. ఇటీవలే కుమార్తె ఇండీతో 'షీలా కీ జవానీ' పాటకు డ్యాన్స్​ చేసి అలరించాడు. ఇప్పుడు కుటుంబంతో కలిసి, జట్టు జెర్సీ ధరించి కాలు కదిపాడు. ఆ వీడియోను ఇన్​స్టాలో పంచుకున్నాడు.

ఐపీఎల్​లో సన్​రైజర్స్ హైదరాబాద్​కు సారథ్యం వహిస్తున్న వార్నర్.. లీగ్ నిరవధిక వాయిదా పడటం వల్ల ఇంటికే పరిమితమయ్యాడు. మార్చి 29నే ప్రారంభమవాల్సిన ఈ సీజన్​ను, ఏప్రిల్ 15కు తొలుత వాయిదా వేశారు. అప్పటికీ వైరస్ ప్రభావం తగ్గకపోవటం వల్ల లీగ్​ను వాయిదా వేయాల్సి వచ్చింది.

ABOUT THE AUTHOR

...view details