తెలంగాణ

telangana

ETV Bharat / sports

'బాలా' పాటకు కూతుళ్లతో చిందేసిన వార్నర్ - డేవిడ్ వార్నర్ తాజా వార్తలు

ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ మరో టిక్​టాక్ వీడియో షేర్ చేశాడు. ఇందులో అక్షయ్ కుమార్ 'బాలా' పాటకు తన కూతుళ్లతో కలిసి చిందేసి అలరించాడు.

David Warner
వార్నర్

By

Published : Jun 13, 2020, 6:09 PM IST

ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్​ లాక్​డౌన్ సమయంలో తన ప్రతిభను బయటపెడుతున్నాడు. టిక్​టాక్ వీడియోలు చేస్తూ అభిమానుల్లో జోష్ నింపుతున్నాడు. తాజాగా తన కూతుళ్లతో కలిసి చేసిన మరో టిక్​టాక్ వీడియోను నెట్టింట షేర్ చేశాడు వార్నర్. ఇందులో అక్షయ్ కుమార్ 'బాలా' పాటకు చిందులేశాడు. అతడి డ్యాన్స్​ను కాపీ కొడుతూ క్యూట్​గా స్టెప్పులేశారు వార్నర్ కూతుళ్లు.

వార్నర్​ వీడియోలకు ప్రశంసలతో పాటు ట్రోల్స్ కూడా వస్తున్నాయి. అయినా అవేమీ పట్టించుకోకుండా వరుస వీడియోలతో సందడి చేస్తున్నాడీ ఆసీస్ క్రికెటర్. ఇప్పటికే చాలా వీడియోలు చేసిన ఈ ఆటగాడు ప్రస్తుతం వేరొకరి వీడియోలకు డ్యూయెట్ చేస్తున్నాడు.

ఇంతకుముందు మహేశ్​బాబు నటించిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలోని 'మైండ్​బ్లాక్' పాటకు తన భార్యతో కలిసి చిందేసి ఆకట్టుకున్నాడు వార్నర్​. తన కంటే క్యాండీస్​(వార్నర్ భార్య) బాగా డ్యాన్స్ చేసిందని రాసుకొచ్చాడు. 'బుట్టబొమ్మ', 'రాములో రాములా', 'పక్కా లోకల్' వంటి గీతాలకూ డ్యాన్స్​లు చేసి అలరించాడు. వీటితో పాటే పలు హిందీ పాటలకు కాలు కదిపాడు. ఈ వీడియోలన్నీ సోషల్ మీడియాలో తెగ వైరల్​గా మారాయి

ABOUT THE AUTHOR

...view details