టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు నేడు పుట్టినరోజు జరుపుకొంటున్నాడు. ఆయన జన్మదినం సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అటు అభిమానులే కాకుండా ఇటు సెలబ్రిటీలు కూడా శుభాకాంక్షలు చెప్పారు. ఆస్ట్రేలియా క్రికెటర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ కూడా మహేశ్‌కు తనదైన శైలిలో విషెస్ చెప్పాడు.
లాక్‌డౌన్ వేళ ఇంటికే పరిమితమైన వార్నర్ టాలీవుడ్ అగ్రహీరోల పాటలకు, సినిమా డైలాగులకు టిక్‌టాక్ వీడియోలు చేసి సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. మహేశ్ బాబు 'మైండ్‌బ్లాక్' సాంగ్‌కు కూడా చిందులేశాడు.