బాల్ ట్యాంపరింగ్ వివాదంతో ఏడాది నిషేధం ఎదుర్కొన్న డేవిడ్ వార్నర్ ఈ ఏడాది జరిగిన యాషెస్ సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చాడు. ఆ సిరీస్‌లో పెద్దగా రాణించని ఈ క్రికెటర్.. తర్వాత ఫామ్ అందుకున్నాడు. కెరీర్లో తొలిసారి త్రిశకతం నమోదు చేశాడు. తాజాగా టెస్టుల్లో ఏడు వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడీ ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్. పెర్త్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఈ ఫీట్ సాధించాడు వార్నర్.
సుదీర్ఘ ఫార్మాట్లో 7వేల రన్స్ చేసిన 12వ ఆసీస్ క్రికెటర్‌గా వార్నర్ నిలిచాడు. 151 ఇన్నింగ్స్‌ల్లో ఈ రికార్డు అందుకున్నాడు. అంతేకాకుండా వేగంగా ఈ ఫీట్ అందుకున్న ఆసీస్ క్రికెటర్ల జాబితాలో... ఆసీస్ దిగ్గజ ఆటగాడు గ్రెయిగ్ చాపెల్‌తో కలిసి 5వ స్థానంలో ఉన్నాడు.