తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆ విషయంలో విరాట్, మన్రో తర్వాత వార్నరే..! - warner t20 centuary

శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో అర్ధశతకంతో మెరిసిన ఆసీస్ ఓపెనర్ వార్నర్​ అరుదైన ఘనత సాధించాడు. పొట్టి ఫార్మాట్​లో మూడు మ్యాచ్​ల్లోనూ వరుసగా 50కిపైగా పరుగులు చేసిన మూడో బ్యాట్స్​మన్​గా రికార్డు సృష్టించాడు.

డేవిడ్ వార్నర్

By

Published : Nov 2, 2019, 5:30 AM IST

Updated : Nov 2, 2019, 7:14 PM IST

యాషెస్​ సిరీస్​లో ఘోరంగా విఫలమై విమర్శలు ఎదుర్కొన్న ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్.. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో విజృంభించి సిరీస్​ క్లీన్ స్వీప్​ చేయడంలో ప్రధాన పాత్ర పోషించాడు. వరుసగా మూడు మ్యాచ్​ల్లో 50కి పైగా పరుగులు చేసిన మూడో బ్యాట్స్​మన్​గా రికార్డు సృష్టించాడు.

శ్రీలంకతో జరిగి తొలి టీ20లో 56 బంతుల్లోనే సెంచరీ (100*) పూర్తి చేసిన వార్నర్ రెండో మ్యాచ్​లో 60* పరుగులు చేశాడు. శుక్రవారం జరిగిన మూడో మ్యాచ్​లో మరో అర్ధసెంచరీతో (57*) రెచ్చిపోయాడు. ఈ సిరీస్​లో మొత్తం 217 పరుగులు చేశాడు వార్నర్. ఈ మూడు మ్యాచ్​ల్లోనూ ఆసీస్ ఓపెనర్​గా నాటౌట్​గా నిలవడం విశేషం.

డేవిడ్ వార్నర్ కంటే ముందు విరాట్ కోహ్లీ, కొలిన్ మన్రో ఈ ఘనత సాధించారు. 2015-16 సీజన్​లో ఆస్ట్రేలియాతో జరిగిన మూడు టీ20ల సిరీస్​లో విరాట్​ (90*, 59*, 50) మూడు అర్ధశతకాలు నెలకొల్పాడు. కివీస్ ప్లేయర్ కొలిన్​ మన్రో 2017-18లో ఈ ఘనత సాధించాడు.

డేవిడ్ వార్నర్

టీ20ల్లో 2 వేలకు పైగా పరుగులు చేసిన తొలి ఆస్ట్రేలియా బ్యాట్స్​మన్​గా రికార్డు సాధించాడు వార్నర్. ఆసీస్​ గడ్డపై వంద సిక్సర్లు బాదిన రెండో ఆటగాడిగానూ ఘనత సాధించాడు. డేవిడ్ కంటే ముందు ఆడమ్​ గిల్​క్రిస్ట్ (105) ఉన్నాడు.

మేల్​బోర్న్ వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో మొదట బ్యాటింగ్ చేసిన లంక జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. కుశాల్ మెండీస్ (57) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. అనంతరం బ్యాటింగ్​కు దిగిన ఆసీస్.. డేవిడ్ వార్నర్ (57*), ఫించ్ (37) ధాటికి 17.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.

ఇదీ చదవండి: ఒలింపిక్స్ అర్హతకు అడుకు దూరంలో భారత హాకీ జట్లు

Last Updated : Nov 2, 2019, 7:14 PM IST

ABOUT THE AUTHOR

...view details