తెలంగాణ

telangana

ETV Bharat / sports

కార్చిచ్చుపై వార్నర్ భావోద్వేగ పోస్ట్

ఆస్ట్రేలియాలో కార్చిర్చు బీభత్సం సృష్టిస్తోంది. ఈ విషయంపై స్పందించిన ఆసీస్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ట్విట్టర్లో ఓ భావోద్వేగపూరిత సందేశం పోస్ట్ చేశాడు.

David
వార్నర్

By

Published : Jan 3, 2020, 11:03 AM IST

ఆస్ట్రేలియాలో సంభవించిన కార్చిచ్చును చూసి తానింకా షాక్‌లో ఉన్నానని ఆ జట్టు స్టార్‌ బ్యాట్స్‌మన్‌ డేవిడ్‌ వార్నర్‌ అన్నాడు. కొద్ది రోజులుగా ఆస్ట్రేలియాలో విస్తరిస్తున్న అగ్నికీలలకు ఇప్పటికే 18 మంది మృతి చెందారు. ఈ నేపథ్యంలో వార్నర్‌ ట్విట్టర్‌లో స్పందిస్తూ ఒక భావోద్వేగపూరిత పోస్టు పెట్టాడు. అందులో ఒకాయన నది ఒడ్డున కూర్చొని మంటలను చూస్తుండగా పక్కనే ఓ శునకం కూడా ఉంది.

వార్నర్

"నేనిప్పుడే ఈ ఫొటో చూశా. ఇంకా షాక్‌లో ఉన్నా. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ జట్లు రేపు మ్యాచ్‌ ఆడనున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జీవించి ఉన్నందుకు ఎంత అదృష్టవంతులమో ఎన్నటికీ మర్చిపోలేము. ఈ మంటలను ఆర్పే అగ్నిమాపక సిబ్బందితో పాటు వారికి సహకరిస్తున్న వాలంటీర్లందరికి.. నాతో పాటు మా కుటుంబ సభ్యుల ఆశీస్సులు ఉంటాయి. ఈ మంటలు మాటలకందనివి. మీరే అసలైన హీరోలు, మేం గర్వపడేలా ప్రకృతి విపత్తులను ఎదుర్కొంటారు."
-వార్నర్, ఆసీస్ క్రికెటర్

శుక్రవారం సిడ్నీ వేదికగా ఆసీస్‌, కివీస్‌ జట్ల మధ్య మూడో టెస్టు ప్రారంభంకానుంది. అయితే, మంటల తీవ్రత అధికంగా ఉండడం వల్ల అక్కడి గాలి నాణ్యత క్షీణించే అవకాశం ఉంది. ఒకవేళ దట్టమైన పొగమంచు కప్పేస్తే అంపైర్లు పరిస్థితిని బట్టి మ్యాచ్‌ను నిలిపివేసే అవకాశం ఉంది.

ఇవీ చూడండి.. ఐదు రోజుల టెస్టులే బాగుంటాయి: మెక్​గ్రాత్

ABOUT THE AUTHOR

...view details