ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ లాక్డౌన్ సమయంలో జాలీగా గడుపుతున్నాడు. కుటుంబంతో కలిసి టిక్‌టాక్ వీడియోలు చేస్తూ అభిమానుల్లో జోష్ నింపుతున్నాడు. తాజాగా అల్లు అర్జున్ 'ఇద్దరమ్మాయిలతో' చిత్రంలోని 'టాప్ లేచిపోద్ది' పాటకు టిక్‌టాక్ చేసి పోస్ట్ చేశాడు. ఇందులో వార్నర్.. భార్య క్యాండిస్, కుమార్తెలతో కలిసి స్టెప్పులేస్తూ సందడి చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజెన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
'టాప్ లేచిపోద్ది' అంటోన్న డేవిడ్ వార్నర్
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ మరో టిక్‌టాక్ వీడియో షేర్ చేశాడు. 'ఇద్దరమ్మాయిలతో' సినిమా నుంచి 'టాప్లేచిపోద్ది' పాటకు వీడియో జత చేసి పోస్ట్ చేశాడు.
david warner new tik tok video now iddarammayilatho movie top lechipoddi song remix video
ఇంతకుముందు మహేశ్‌బాబు నటించిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలోని 'మైండ్‌బ్లాక్' పాటకు తన భార్యతో కలిసి చిందేసి ఆకట్టుకున్నాడు వార్నర్. తన కంటే క్యాండిస్(వార్నర్ భార్య) బాగా డ్యాన్స్ చేసిందని రాసుకొచ్చాడు. 'బుట్టబొమ్మ', 'రాములో రాములా', 'పక్కా లోకల్' వంటి గీతాలకూ చిందేసి అలరించాడు. వీటితో పాటే పలు హిందీ పాటలకు కాలు కదిపాడు. ఈ వీడియోలన్నీ సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి.
ఇదీ చూడండి:రామ్‌గోపాల్ వర్మ కొత్త చిత్రం 'పవర్ స్టార్'