తెలంగాణ

telangana

ETV Bharat / sports

5 పరుగుల కోత​.. అంపైర్​తో వార్నర్ వాగ్వాదం - ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్

ఆస్ట్రేలియా-న్యూజిలాండ్​ మూడో టెస్టులో అంపైర్లతో డేవిడ్​ వార్నర్ గొడవకు దిగాడు. జట్టు స్కోరులో అంపైర్లు.. 5 పరుగుల కోత విధించడమే ఇందుకు కారణం.

5 పరుగుల కోత​.. అంపైర్​తో వార్నర్ వాగ్వాదం
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్

By

Published : Jan 6, 2020, 5:20 PM IST

న్యూజిలాండ్​తో జరిగిన మూడు టెస్టుల సిరీస్​ను ఆస్ట్రేలియా క్లీన్​స్వీప్ చేసింది. చివరి మ్యాచ్​లో 279 పరుగుల తేడాతో కంగారూలు విజయం సాధించారు. అయితే ఇందులో ఆసీస్​ బ్యాట్స్​మన్ వార్నర్​ చేసిన ఓ పని, అంపైర్లకు ఆగ్రహం తెప్పించింది. ఫలితంగా 5 పరుగుల పెనాల్టీ విధించారు.

మూడో టెస్టులోని ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్​లో ఈ సంఘటన జరిగింది. మ్యాచ్​లోని 50వ ఓవర్​ వేసిన హెన్రీ బౌలింగ్​లో బంతిని కొట్టిన వార్నర్.. డేంజర్ జోన్​లో నడిచాడు. నిబంధనల ప్రకారం అంపైర్లు జరిమానా విధించారు. ఈ క్రమంలోనే వారితో వాగ్వాదానికి దిగాడువార్నర్​. ఎమ్​సీసీ లా ఆఫ్ క్రికెట్ నిబంధన 41.14 ప్రకారం.. పిచ్​కు నష్టం కలిగిస్తే వారు శిక్షార్హులు.

ఇది చదవండి: మూడో టెస్టులో కివీస్​పై ఆసీస్ విజయం.. సిరీస్ క్లీన్ స్వీప్

ABOUT THE AUTHOR

...view details