తెలంగాణ

telangana

ETV Bharat / sports

విలియమ్సన్, వార్నర్​ల ఉత్తమ క్రికెటర్లు వీరే! - David Warner latest news

ఐపీఎల్​లోని సన్​రైజర్స్ హైదరాబాద్ నిర్వహించిన ఓ లైవ్ సెషన్​లో పాల్గొన్న క్రికెటర్లు విలియమ్సన్, వార్నర్​లు పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తమకు నచ్చిన ఉత్తమ క్రికెటర్ల పేర్లు వెల్లడించారు.

వార్నర్
వార్నర్

By

Published : Apr 26, 2020, 9:57 AM IST

కరోనా కారణంగా లభించిన ఖాళీ సమయాన్ని కుటుంబంతో గడుపుతూ కాలక్షేపం చేస్తున్నారు క్రికెటర్లు. సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా వ్యవహరిస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటున్నారు. ఇటీవలే ఐపీఎల్ ఫ్రాంఛైజీ సన్​రైజర్స్ హైదరాబాద్ లైవ్ సెషన్ ఏర్పాటు చేసింది. ఇందులో పాల్గొన్న విలియమ్సన్(న్యూజిలాండ్), డేవిడ్ వార్నర్(ఆస్ట్రేలియా).. పలు ఆసక్తికర విషయాల్ని పంచుకున్నారు.

వార్నర్: ప్రస్తుతం నీ దృష్టిలో ఉత్తమ క్రికెటర్ ఎవరు?

విలియమ్సన్: ఇది చాలా కష్టమైన ప్రశ్న. నాకైతే కోహ్లీ, డివిలియర్స్​ అత్యుత్తమ ఆటగాళ్లు. ఇందులో ఒకరిని ఎంచుకోవాలంటే డివిలియర్స్ కాస్త మెరుగు. అతడో గొప్ప బ్యాట్సమన్. అతడే ప్రత్యేకమైన ప్లేయర్. కోహ్లీ.. అన్ని ఫార్మాట్లలోనూ ఆకలితో పరుగులు సాధిస్తున్నాడు. అతడు ఆడుతుంటే చూడటానికి బాగుంటుంది. విరాట్ నుంచి చాలా నేర్చుకోవచ్చు.

విలియమ్సన్: నీ దృష్టిలో ఉత్తమ క్రికెటర్ ఎవరు?

వార్నర్: నా ప్రకారం నువ్వు (విలియమ్సన్), స్టీవ్ స్మిత్, విరాట్ కోహ్లీ ఉత్తమ క్రికెటర్లు.

ABOUT THE AUTHOR

...view details