లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమైన ఆటగాళ్లందరూ తమకిష్టమైన వ్యాపకాలతో బిజీగా గడుపుతున్నారు. నిత్యం సోషల్‌మీడియాలో చురుగ్గా ఉంటూ అభిమానులతో ముచ్చటిస్తున్నారు. తాజాగా ఇన్‌స్టా లైవ్‌లో పాల్గొన్న టీమ్ఇండియా సారథి కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్.. క్రికెట్ సహా పలు ఆసక్తికరమైన విషయాల గురించి సంభాషించుకున్నారు. అయితే వీరు మాట్లాడుకుంటున్న సమయంలో వార్నర్ కామెంట్ చేశాడు. వెంటనే కోహ్లీ స్పందించాడు.
"ప్రస్తుతం వార్నర్ టిక్‌టాక్ వీడియోలు చేస్తూ బిజీగా ఉన్నాడు. అతడు నన్ను కూడా టిక్‌టాక్ వీడియోలు చేయమని నా వెంట పడుతున్నాడు.త్వరలోనే అతడికి సమాధానమిస్తా "
-కోహ్లీ, టీమ్ఇండియా సారథి.