ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన కుమార్తెతో కలిసి బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ పాటకు డ్యాన్స్ చేశాడు. బార్బీగర్ల్ కత్రినా కైఫ్ ఆడిపాడిన పాపులర్ గీతం 'షీలాకీ జవానీ'కి టిక్‌టాక్ చేశాడు. ఈ వీడియోను ఇన్‌స్టాలో పంచుకున్నాడు. ఇద్దరు కలిసి డ్యాన్స్ చేసిన తీరు నెటిజన్లను నవ్విస్తోంది.
'ఎవరైనా మాకు సాయం చేయండి. ప్లీజ్' అంటూ వీడియోకు వ్యాఖ్యను జోడించాడు వార్నర్. దీనిని 10 గంటల్లో 6 లక్షల మందికిపైగా వీక్షించారు.