లాక్డౌన్లో టిక్‌టాక్ వీడియోలతో కాలక్షేపం చేస్తున్న ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్.. బాలీవుడ్ నటి శిల్పాశెట్టి చేసిన ఓ వీడియోను చూసి నవ్వు ఆపులేకపోయాడు. టిక్‌టాక్‌లోని ఫేస్ ఫిల్టర్ సాయంతో హాస్యాస్పదంగా ఓ వోకల్ సాంగ్‌ను పాడిన వీడియోను షేర్ చేసింది శిల్ప. ఆమెను చూసి తానూ ఆ విధంగా చేయాలని ప్రయత్నించినా.. అలా రాకపోవడం వల్ల నవ్వును ఆపుకోలేకపోయాడు వార్నర్.
"ఈ వీడియో నన్ను బాగా నవ్వించేలా చేసింది శిల్పాశెట్టి" అని క్యాప్షన్ పెట్టి ఆమె వీడియోకు తన వీడియోను కలిపి ఇన్‌స్టాలో పోస్టు చేశాడు వార్నర్. ఇటీవలే శిల్పాశెట్టి నటించిన ఓ సినిమాలోని పాటకు స్టెప్పులేసిన వీడియోకు ఆమెను ట్యాగ్ చేశాడీ ఆసీస్ ఓపెనర్.