కోల్కతా నైట్ రైడర్స్ సారథి దినేశ్ కార్తీక్, ఆ జట్టు ఆటగాడు ఆండ్రూ రసెల్ మధ్య గతేడాది గొడవ జరిగినట్లు ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హగ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. దీంతో కేకేఆర్ యాజమాన్యం వారిపట్ల అసంతృప్తిగా ఉన్నట్లు చెప్పాడు. తాజాగా ఈ విషయమై స్పందించిన కేకేఆర్ మెంటార్ డేవిడ్ హస్సీ ఈ వ్యాఖ్యలను ఖండించాడు. దినేశ్, రసెల్ మధ్య ఎటువంటి ఘర్షణ జరగలేదని స్పష్టం చేశాడు. వీరిద్దరి మధ్య మంచి స్నేహబంధం ఉందన్నాడు.
"వారిమధ్య ఎటువంటి గొడవలు లేవు. ఇద్దరు అన్యోన్యంగా కలిసి ఉంటారు. కార్తీక్ ముక్కుసూటి మనిషి. సహచర ఆటగాళ్లను బాగా ప్రోత్సాహిస్తాడు. ఎప్పుడూ గెలవాలనే లక్ష్యంతో ఆడుతుంటాడు."
-డేవిడ్ హస్సీ, కేకేఆర్ మెంటార్.