యువ క్రికెటర్లకు.. డోపింగ్, అవినీతి అంశాలతో పాటు జాతి వివక్షపై గురించి అవగాహన పెంచాలని ఐసీసీకి సూచించాడు వెస్టిండీస్ మాజీ సారథి డారెన్ సామి. యువ క్రికెటర్లు దీని గురించి తెలుసుకోవడం ఎంతో ముఖ్యమని అన్నాడు. తద్వారా క్రికెట్లో అడుగుపెట్టే ప్రతి ఒక్కరిని సమానంగా చూసే ఆలోచనా ధోరణి, తోటి క్రికెటర్లకు అలవాటవుతుందని చెప్పుకొచ్చాడు. ఐసీసీ నిర్వహించిన ఆన్లైన్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించాడు.
"యువక్రికెటర్లకు డోపింగ్, అవినీతి అంశాలతో పాటు జాతివివక్ష గురించి అవగాహన పెంచాలి. ఎందుకంటే క్రికెట్లో భిన్నవర్గాలు, ప్రాంతాలు, నేపథ్యాలకు చెందిన వారు వస్తుంటారు. కాబట్టి ఈ అంశంపై ప్రత్యేక శ్రద్ధతో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. ఫలితంగా ప్రతిఒక్కరిని సమానంగా చూసే వ్యక్తిత్వం ఆటగాళ్లలో అలవడుతుంది"
-డారెన్ సామి, వెస్టిండీస్ మాజీ సారథి