క్రికెట్లో లాలాజలం వినియోగంపై నిషేధం విధించిన నేపథ్యంలో.. బౌలర్లు ప్రత్యామ్నాయ మార్గాలను కనుగొనాల్సి ఉంటుందని దక్షిణాఫ్రికా పేసర్ లుంగి ఎంగిడి అన్నారు. ఈ క్రమంలోనే బంతి మెరుపు కోసం ఉమ్ము బదులు తడి తువాలు ఉపయోగించడం ఉత్తమమని అభిప్రాయపడ్డాడు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో బంతిపై లాలాజలం వినియోగాన్ని తాత్కాలికంగా నిషేధించింది ఐసీసీ.
'బంతి మెరుపు కోసం తడి తువాలు ఉత్తమం' - latest test series news updates
క్రికెట్లో బంతి మెరుపు కోసం లాలాజలం బదులు తడి తువాలు వినియోగం ఉత్తమమని దక్షిణాఫ్రికా పేసర్ లుంగి ఎంగిడి అభిప్రాయపడ్డాడు.
లుంగి ఎంగిడి
"లాలాజలంపై నిషేధం విధించిన విషయం తెలిసిన వెంటనే.. కొందరు బ్యాట్స్‌మన్ డ్రైవ్ షాట్లు కొడుతున్నట్టుగా గ్రూప్‌లో ఫొటోలు పంచుకున్నారు. బంతిపై మెరుపు వచ్చేలా చేయడం కోసం లాలాజం ఉపయోగించకూడదన్న ఐసీసీ నిర్ణయం బౌలర్లకు ప్రతికూలమే. అయితే, బంతిపై మెరుపు కోసం ఎదో ఒకటి చేయాలి. బహుశా తడి తువాలు ఉత్తమేమో." అని ఎంగిడి తెలిపాడు.
ఇదీ చూడండి:'ప్రపంచకప్‌లో భారత్‌పై గెలిచి బాకీ తీర్చుకుంటాం '