తెలంగాణ

telangana

ETV Bharat / sports

దక్షిణాఫ్రికా స్పీడ్​స్టర్​ స్టెయిన్​ బౌలింగ్​కు దూరం..!

దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ డెయిల్ స్టెయిన్​కు గాయమైన భుజం.. చికిత్సకు స్పందించట్లేదు. పూర్తిగా బౌలింగ్​కు దూరమవ్వాలని డాక్టర్లు సూచించారు. ఇక స్టెయిన్​ భవిష్యత్తులోనూ బౌలింగ్​ చేసే పరిస్థితులు కనిపించట్లేదు.

By

Published : Jun 4, 2019, 5:27 PM IST

స్టెయిన్

ప్రపంచకప్​లో దక్షిణాఫ్రికాను దురదృష్టం వెంటాడుతోంది. ఇప్పటికే ఆడిన రెండు మ్యాచ్​ల్లో ఓడి నిరాశలో కూరుకుపోయింది జట్టు. బంగ్లాదేశ్​తో జరిగిన రెండో మ్యాచ్​లో అనూహ్య ఓటమి చెందిన సఫారీ జట్టుకు ఆటగాళ్ల గాయాల బెడద మరింత కలవరపెడుతోంది.

బంగ్లాతో జరిగిన మ్యాచ్​లో గాయపడ్డ పేసర్ ఎంగిడి భారత్​తో జరిగే మ్యాచ్​కు దూరమయ్యాడు. అతడి స్థానంలో స్టార్ పేసర్ స్టెయిన్​ను తీసుకోవాలన్న జట్టు ఆశలు ఆవిరయ్యాయి. భుజం గాయం కారణంగా ఈ సఫారీ స్పీడ్​స్టర్​​ ప్రపంచకప్​తో పాటు భవిష్యత్తులోనూ ఇక బౌలింగ్​ చేసే పరిస్థితులు కనిపించేలా లేవు. ప్రస్తుతం గాయమైన భుజం.. చికిత్సకు స్పందించట్లేదు. భవిష్యత్​ అవసరాల దృష్ట్యా పూర్తిగా బౌలింగ్​కు దూరంగా ఉండాలని డాక్టర్లు సూచించారు. ఇతడి స్థానంలో హెన్రిక్స్ జట్టులో చోటు సంపాదించాడు.

ఇవీ చూడండి.. ఫీల్డింగే మా కొంప ముంచింది: మోర్గాన్

ABOUT THE AUTHOR

...view details