లాక్డౌన్ సమయాన్ని కుటుంబంతో గడుపుతూ కాలక్షేపం చేస్తున్నాడు టీమ్ఇండియా ఓపెనర్ శిఖర్ ధావన్. ఇటీవలే టాయ్‌లెట్ క్లీన్ చేస్తున్న ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. తాజాగా తనయుడు జోరావర్‌తో డ్యాన్స్ చేస్తున్న వీడియోను నెట్టింట షెర్ చేశాడు.
తనయుడితో ధావన్ డ్యాన్స్.. వీడియో వైరల్ - Shikhar Dhawan dance video
లాక్డౌన్ సమయంలో కుటుంబంతో సరదాగా గడుపుతున్నాడు టీమ్ఇండియా క్రికెటర్ శిఖర్ ధావన్. తాజాగా తన తనయుడితో కలిసి డ్యాన్స్ చేసిన వీడియోను నెట్టింట పంచుకున్నాడు.
ధావన్
బాలీవుడ్ పాట 'డాడీ కూల్'కు జోరావర్‌తో పాటు ధావన్ కలిసి డ్యాన్స్ చేశాడు. ఈరోజు తండ్రీకొడుకులిద్దరూ కూల్‌గా ఉన్నారంటూ క్యాప్షన్ ఇచ్చాడు. అభిమామనులు కూడా ఈ డ్యాన్స్ చూసి కామెంట్లు పెడుతున్నారు.
ఇటీవలే ఇంట్లో బట్టలు ఉతుకుతూ, టాయ్‌లెట్ కడుగుతున్న వీడియోలను అభిమానులతో పంచుకున్నాడు ధావన్. దీనిపై పలువురు క్రికెటర్లు కామెంట్లు చేశారు.